cyclone gulab: తెలంగాణలో కుండపోత, స్థంభించిన జనజీవనం, రాకపోకలు బంద్

By narsimha lodeFirst Published Sep 28, 2021, 9:44 AM IST
Highlights

 గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.  
 

హైదరాబాద్: గులాబ్ తుఫాన్ (cyclone gulab) ప్రభావం తెలంగాణ (telangana)రాష్ట్రంపై తీవ్రంగా కన్పించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా జనజీవనం స్థంబించింది. తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ  (IMD)శాఖ రెడ్ అలర్ట్ (Red alert)ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో 16.13 సెం.మీ వర్షపాతం రికార్డైంది.సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.98 సెం.మీ. వర్షపాతం, ఖమ్మం జిల్లా ఇచ్చోడలో 15.15 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.9 సెం.మీ. జమ్మికుంటలో 14.8 సెం.మీ. వీణవంకలో 14.8 సెం.మీ. వైరాలో 14.2 సెం.మీ హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో 11.08 సెం.మీ వర్షపాతం నమోదైంది.గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైద్రాబాద్ నగరంలో కూడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడ  పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. 


 

click me!