లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త

Published : Jun 26, 2020, 05:31 PM ISTUpdated : Jun 26, 2020, 05:33 PM IST
లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త

సారాంశం

భర్త వివాహేతర సంబంధాలను పెట్టుకొని సదరు మహిళను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. తనకు తాళి కట్టిన భర్త ఇలా ప్రవర్తిస్తుండడం ఆ మహిళ తట్టుకోలేకపాయింది. దీనితో ఆమె సూసైడ్ చేసుకుంది. 

భర్త వేధింపులను తాళలేక ఒక మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పరిధిలో జరిగింది. భర్త అక్రమ సంబంధం వారిద్దరి మధ్య అగాధానికి దారితీసి ఆ మహిళ బలవన్మరణానికి కారణమైంది. 

వివరాల్లోకి వెళితే శంషాబాద్ కి చెందిన లావణ్య లహరి అనే మహిళకు, వెంకటేశం అనే వ్యక్తికి మధ్య వివాహం జరిగింది. లావణ్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా, ఆమె భర్త పైలట్ గా పనిచేస్తున్నాడు. వీరిరువురు ఆరంభంలో బాగానే ఉన్నారు. వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. 

భర్త వివాహేతర సంబంధాలను పెట్టుకొని సదరు మహిళను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. తనకు తాళి కట్టిన భర్త ఇలా ప్రవర్తిస్తుండడం ఆ మహిళ తట్టుకోలేకపాయింది. దీనితో ఆమె సూసైడ్ చేసుకుంది. 

ఆత్మహత్యకు ముందు మహిళా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతగానో ప్రేమించిన భర్త ఇలా అక్రమ సంబంధాలను ఇతర మహిళలతో పెట్టుకుంటుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చెప్పింది. 

మొదటిసారి అక్రమసంబంధం విషయంలో దొరికినప్పుడు మారతాను అని చెప్పిన భర్త అప్పుడు కూడా మారలేదని, రెండవసారి కూడా మారతాను అని చెప్పినావు ఇంకా తాను ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చిన బట్టలను వేసుకుంటూ... వెళ్లి వేరే మహిళలతో అక్రమ సంబంధాలను నెరుపుతుండడంతో... తట్టుకోలేక లావణ్య తన ప్రాణాన్ని తీసుకుంది. 

తన భ్యర్థ అంటే తనకు చాలా ఇష్టమని, ఇంకా కూడా ప్రేమిస్తున్నానని, ప్రేమ ఉంది కాబట్టే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆమె అన్నది. తండ్రికి క్షమాపణలు చెబుతూ .... భర్త వెంకటేశంపై ఎటువంటి కేసులు అవసరం లేదని, వాడి పాపాలే వాడిని తీసుకొని వెళ్ళిపోతాయని ఆమె అన్నది. 

బ్యాంకు పనులు, కోర్ట్ కేసులు, ఫ్లైట్ లే ఓవర్లు అంటూ హోటల్ గదుల్లో వేరే మహిళతో గడుపుతున్నాడని ఆమె ఆవేదనతో మరణించింది. వేరే మహిళలతో ఇంట్లోనే వీడియో కాల్స్ మాట్లాడుతుంటే తాను నిత్య నరకం చూసేదాన్ని ఆమె తెలిపింది. 

లభించిన మరో వీడియో ఫుటేజిలో వెంకటేశం లావణ్య పై దాడి చేస్తున్న విజువల్స్ కూడా వెలుగుచూశాయి.  ఈ అన్ని ఘోరాలను పంటిబిగువున భరించిన సదరు యువతీ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని మరణించింది. శంషాబాద్ లోని వారి విల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. ఇలా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో... కుటుంబ సభ్యులు వెంకటేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?