నిజాం కాలేజీలో విద్యార్ధుల ఆందోళన: కొత్త హస్టల్ భవనం కేటాయింపుపై నిరసనలు

By narsimha lode  |  First Published Nov 9, 2022, 12:29 PM IST

కొత్త హస్టల్ భవనాన్ని తమకే కేటాయించాలని నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్ధులు బుధవారంనాడు కూడ ఆందోళనకు దిగారు.ఈ విషయమై మంత్రి కేటీఆర్ నిన్ననే విద్యార్ధులకుహామీ ఇచ్చారు. అయితే ప్రిన్సిపాల్ నుండి లిఖిత పూర్వకహామీ వస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్ధులు చెబుతున్నారు.


హైదరాబాద్:నిజాం కాలేజీలో కొత్త హస్టల్ భవనాన్ని పీజీ విద్యార్ధులకు కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్ధినులు బుధవారంనాడు ఆందోళన కు దిగారు. ఈ విషయమై మంత్రి  కేటీఆర్ హామీ ఇచ్చినా కూడ విద్యార్ధినులు శాంతించలేదు.తమకు ప్రిన్సిపాల్ నుండి రాతపూర్వకమైన హామీ లభిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు.

కొత్తగా  నిర్మించిన హస్టల్ భవనాన్ని డిగ్రీ విద్యార్ధులకు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యార్ధినులు కోరుతున్నారు. ఈ హస్టల్ భవనాన్నితమకు తెలియకుండానే పీజీ విద్యార్ధులకు కేటాయించడంపై డిగ్రీ విద్యార్ధులు నాలుగైదు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.అంతేకాదు ఇదే విషయమై నాలుగు  రోజుల క్రితం ప్రిన్సిపాల్ కార్యాలయం ముందు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 

Latest Videos

ఈ ఆందోళనల విషయాన్ని కొందరు ట్విట్టర్ వేదికగా  మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఆయన స్పందించారు. ఈ విషయంలో జోక్యం  చేసుకోవాలని మంత్రి కేటీఆర్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు.అంతేకాదు సమస్య పరిష్కరించాలని నిజాం కాలేజీ  ప్రిన్సిపాల్ ను  కేటీఆర్ నిన్ననే ఆదేశించారు. అయితే  ఈ విషయమై కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినా కూడా తమకు స్పష్టమైన హామీ రాలేదని డిగ్రీ విద్యార్ధులుఆందోళనలు చేస్తున్నారు.
 

click me!