మెదక్ జిల్లా రంగంపేటలో రైతుల రాస్తారోకో.. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్..

Published : Nov 09, 2022, 11:20 AM IST
మెదక్ జిల్లా రంగంపేటలో రైతుల రాస్తారోకో.. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్..

సారాంశం

మెదక్ జిల్లా రంగంపేటలో రైతుల రాస్తారోకో నిర్వహించారు. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. 

మెదక్ జిల్లా రంగంపేటలో రైతుల రాస్తారోకో నిర్వహించారు. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే వడ్ల  కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం బస్తాలతో నిండిన ట్రాక్టర్లను, లారీని తీసుకొచ్చి రోడ్డుపై నిలిపివేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మార్వో వస్తున్నారని, కలెక్టర్‌తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతారని రైతులకు చెప్పారు. 

అయితే రైతులు మాత్రం రోడ్డుపై బైఠాయించి నిరసన  కొనసాగిస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను  కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu