గంటా చక్రపాణికి గంటలతో నిరసన తెలిపిన నిరుద్యోగ జేఏసీ

Published : Jul 04, 2017, 12:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
గంటా చక్రపాణికి గంటలతో నిరసన తెలిపిన నిరుద్యోగ జేఏసీ

సారాంశం

గురుకుల పోస్టుల భర్తీ రాత పరీక్ష గడువు పెంచాలని అభ్యర్థుల డిమాండ్ 90 రోజుల గడువు పెంచాలన్న నిరుద్యోగుల డిమాండ్ ను పట్టించుకోని టీఎస్పీఎస్సీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి వైఖరిని సరికాదని గంటలతో విద్యార్థుల నిరసన

గురుకుల మెయిన్స్ పరీక్ష కు 90రోజుల సమయం ఇవ్వాలని ఎన్ని పోరాటాలు చేసినా వినతి పత్రాలిచ్చినా ప్రభుత్వం కాని ట.ఎస్.పి.ఎస్.సి ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి కాని పట్టించుకోలేదని నిరసిస్తూ ఈ రోజు ఓయూలో గంటలు మోగిస్తూ ఘంటా చక్రపాణి తీరుమారలని ఈ రోజు సాయంత్రం నిరుద్యోగ జెఏసి ఆధ్వర్యంలో  వినూత్న నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నిరుద్యోగ జెఏసి ఛైర్మన్‌ కోటూరి మానవతా రాయ్ మాట్లాడుతూ సిలబస్‌ భారీస్థాయిలో 300మార్కులు ఉన్న కారణంగా, చదవటానికి తెలుగు అకాడమీ ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు కాలు ముద్రించని కారణంగా మెయిన్స్ పరీక్షకు కనీస సమయం ఇవ్వాలని విద్యశాఖమంత్రి కడియం శ్రీహరిని కల్సినా ఫలితం లేదని అంతా చక్రపాణి దేనని చెప్పి తప్పించుకోంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోమన్నారు.


ఈనెల 16నజరిగే గురుకుల  ప్రిన్సిపల్,జెఎల్ &డిఎల్ ప్రిలిమ్స్ పరీక్ష 40రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ పరీక్షకు దరఖాస్తు గడువు ఈనెల 24తో ముగిసిన కారణంగా తక్కువ వ్యవధి సరిపోదన్నారు. అవసరమైతే పరీక్షల గడువుకోసం ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. కార్యమ్రంలో నిరుద్యోగ జెఏసి నాయకులు వి.భీమ్ రావ్ నాయక్,మస్కాపురం నరేష్,గంజి శ్రీనివాస్,వనం కిరణ్,శ్రీశైలం యాదవ్,రజనీకర్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu