గొర్రెకుంట బావిలో 9 డెడ్‌బాడీలు: పోలీసులకు చిక్కిన క్లూ ఇదీ....

By narsimha lodeFirst Published May 25, 2020, 5:22 PM IST
Highlights

గొర్రెకుంట బావిలో 9 మంది మృతదేహాలకు సంబంధించిన కేసును చేధించడంలో పోలీసులకు సీసీటీవీ దృశ్యాలు కీలకంగా పనిచేశాయని వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు. 9 మందిని హత్య చేసిన బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు.

వరంగల్: గొర్రెకుంట బావిలో 9 మంది మృతదేహాలకు సంబంధించిన కేసును చేధించడంలో పోలీసులకు సీసీటీవీ దృశ్యాలు కీలకంగా పనిచేశాయని వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు. 9 మందిని హత్య చేసిన బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు.

గొర్రెకుంట బావిలో ఈ నె 21వ తేదీన నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. మరునాడు మరో ఐదు మృతదేహాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఆరు పోలీసులు టీమ్ లు దర్యాప్తు కొనసాగించాయి. 

also read:మక్సూద్ మరదలితో అఫైర్, చంపేసి దాచేందుకే....: గొర్రెకుంట ఘటనపై సీపీ

ఈ నెల 20వ తేదీ సాయంత్రం గొర్రెకుంట బావి సమీపంలో ఉంటున్న మక్సూద్ ఇంటి వద్దకు సైకిల్ పై సంజయ్ కుమార్ వచ్చాడు. తన వెంట నిద్రమాత్రల పౌడర్ వెంట తెచ్చుకొన్నాడు.  మక్సూద్ పెద్ద కొడుకు బర్త్ డే కోసం భోజనం తయారు చేశారు. ఈ భోజనంలో నిద్రమాత్రల పౌడర్ ను కలిపాడు. నిద్రమాత్రల పౌడర్ ను కలిపిన భోజనం తిన్న మక్సూద్ కుటుంబసభ్యులు మత్తులోకి జారుకొన్నారు.

ఇదే భవనంలో పై అంతస్తులో ఉన్న బీహార్ కు చెందిన యువకుల భోజనంలో కూడ నిద్రమాత్రల పౌడర్ కలిపాడు. దీంతో ఆ ఇధ్దరు కూడ మత్తులోకి జారుకొన్నారు. ఒక్కొక్కరిని గోనె సంచిలో వేసుకొని బావిలో పారేశారు.

ఉదయం ఆరున్నర గంటలకు ఆయన తన సైకిల్ పై తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ దృశ్యాలు  సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తన వెంట గోనెసంచిలు తెచ్చుకొన్నాడు.ఈ దృశ్యాలు కూడ తాము సేకరించినట్టుగా ఆయన చెప్పారు.

ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తే అసలు విషయం వెలుగు చూసిందని సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు.

click me!