హైదరాబాద్ పబ్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు వన్యప్రాణుల ప్రదర్శన.. వీడియోలు వైరల్.. పబ్ యజమాని అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published May 30, 2023, 2:33 PM IST
Highlights

హైదరాబాద్‌ నగరంలో ఇటీవలికాలంలో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లోని జోరా  పబ్‌లో వైల్డ్ జంగల్ పార్టీ నిర్వహించారు.

హైదరాబాద్‌ నగరంలో ఇటీవలికాలంలో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. చాలా మంది యువతీయుకులు పబ్‌లకు వెళ్లేందుకు ఆసక్తిక చూపుతున్నారు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లోని జోరా  పబ్‌లో వైల్డ్ జంగల్ పార్టీ నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా వన్యప్రాణులను ప్రదర్శించినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే పబ్ నిర్వాహకులు వన్యప్రాణులను బందించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో ఉన్న ప్రముఖ నైట్ క్లబ్ జోరాలో అన్యదేశ జంతువులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వారి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పోస్టు చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

ఇక, క్లబ్ లోపల వన్యప్రాణులను ప్రదర్శించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది విస్తృత విమర్శలకు దారితీసింది. ఇటువంటి చర్యలు సిగ్గు చేటు, షాకింగ్ గురిచేశాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పారు. డీజీపీ, సీపీ హైదరాబాద్‌ దృష్టికి తీసుకెళ్తా అంటూ అరవింద్ కుమార్ ట్విట్ చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. పబ్ యజమాని వినయ్‌‌రెడ్డిని అరెస్ట్ చేశారు. 

 

Taking it up with and PCCF

The audacity is shameful & shocking https://t.co/JADNkZLMAL

— Arvind Kumar (@arvindkumar_ias)

ఇక, ఈ ఘటనపై పోలీసులు, అటవీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము ఏ తప్పు చేయలేదని జోరా పబ్ వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రదర్శనలో కనిపించే జంతువులన్నీ చట్టబద్ధంగా పొందబడ్డాయని పేర్కొన్నాయి. వాటికి అవసరమైన లైసెన్సులు, అనుమతులు ఉన్నాయని తెలిపాయి. ఈవెంట్‌ల సమయంలో జంతువులకు ఎటువంటి హాని జరగలేదని చెప్పాయి.  జంతువులను చాలా జాగ్రత్తగా , శ్రద్ధతో నిర్వహించామని, అవసరమైన అన్ని భద్రతా చర్యలను పాటిస్తున్నామని పేర్కొన్నాయి. 


 

click me!