తెలంగాణ: మరోసారి వెయ్యిలోపు కేసులు.. భారీగా రికవరీలు

Siva Kodati |  
Published : Jul 01, 2021, 08:28 PM IST
తెలంగాణ: మరోసారి వెయ్యిలోపు కేసులు.. భారీగా రికవరీలు

సారాంశం

తెలంగాణలో మరోసారి 1000 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,05,123 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 869 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు

తెలంగాణలో మరోసారి 1000 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,05,123 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 869 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,669కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,197 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 101 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 38, జీహెచ్ఎంసీ 101, జగిత్యాల 19, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 19, గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ 51, ఖమ్మం 52, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 17, మహబూబాబాద్ 35, మంచిర్యాల 42, మెదక్ 6, మేడ్చల్ మల్కాజిగిరి 41, ములుగు 20, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 72, నారాయణపేట 5, నిర్మల్ 8, నిజామాబాద్ 8, పెద్దపల్లి 45, సిరిసిల్ల 22, రంగారెడ్డి 65, సిద్దిపేట 28, సంగారెడ్డి 10, సూర్యాపేట 54, వికారాబాద్ 8, వనపర్తి 9, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ 33, యాదాద్రి భువనగిరిలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్