దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుమోటో‌గా తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్సీ

Published : Dec 06, 2019, 03:00 PM ISTUpdated : Dec 06, 2019, 03:10 PM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుమోటో‌గా తీసుకొన్న ఎన్‌హెచ్‌ఆర్సీ

సారాంశం

దిశ నిందితుల ఎన్‌క్ౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది.


హైదరాబాాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొంది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ కేసును సుమోటో‌గా తీసుకొంది జాతీయ మానప హక్కుల సంఘం.

Also read:కేసీఆర్ ఆగ్రహం ఇదీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తలసాని

గత నెల 27వ తేదీన  చటాన్‌పల్లి  వద్ద దిశను నలుగురు నిందితులు  అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశారు.

Also read:దిశ రేప్ నిందితుల ఎన్‌కౌంటర్‌: నాడు సజ్జనార్‌, నేడు పోలీసులను ఎత్తుకొని డ్యాన్స్

పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై జాతీయ మానవహక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆదేశించింది.

Also read:నన్ను కాల్చి చంపండి: దిశ రేప్ నిందితుడు చెన్నకేశవులు భార్య

త్వరలోనే సంఘటన స్థలాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సంఘటన స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటన స్థలాన్ని ఎప్పుడు పరిశీలించనుందో అనే విషయమై మరికొద్దిసేపట్లో తేలనుంది.

జాతీయ మానవహక్కుల సంఘం  తెలంగాణ పోలీసులకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై తెలంగాణ పోలీసులు ఏం సమాధానం ఇస్తారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu