regional ring road: ఆర్ఆర్ఆర్‌ ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు.. 11 చోట్ల ఇంటర్‌ ఛేంజ్‌లు, ఎన్‌హెచ్ఏఐ ఆమోదం

By Siva Kodati  |  First Published Jun 24, 2022, 2:59 PM IST

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు పనులకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్ట్‌లో 11 చోట్ల ఇంటర్ ఛేంజ్‌లను ఎన్‌హెచ్ఏఐ ఖరారు చేసింది. 


కేసీఆర్ ప్రభుత్వం (kcr govt) ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) (RRR) ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు 11 చోట్ల ఇంటర్ ఛేంజ్‌లను (interchange) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) (national highway authority of india) ఖరారు చేసింది. వాహనాల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ అవతల మరో రింగ్ రోడ్డు ఉండాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ ఆరు లేన్లలో 330 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రణాళిక రచించింది. ఆర్ఆర్ఆర్ తో ప్రధాన జాతీయ రహదారులైన ఎన్ హెచ్ 65, ఎన్ హెచ్ 44, ఎన్ హెచ్ 163, ఎన్ హెచ్765 అనుసంధానిస్తే.. హైదరాబాద్ పై, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది.
      
ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే భూ సర్వే పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి పలు అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా ఇంటర్ ఛేంజ్ లను ఖరారు చేయడంతో కీలక మందడుగు పడినట్టయింది. ఇంటర్ ఛేంజ్ లు ఉన్న ప్రాంతాల్లో ఆయా గ్రామాల ప్రజలకు, ప్రయాణికులకు, ట్రాఫిక్ సులువుగా వెళ్లేందుకు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ మీదకు ఎక్కడం, దిగడం కోసం మరికొన్ని ప్రాంతాల్లో ఓఆర్ఆర్‌పై ఉన్నట్టు ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నట్లు ఎన్‌హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

ఇంటర్ ఛేంజర్లు వచ్చే ప్రాంతాలివే:

1.హైదరాబాద్ - పూణె              గిర్మాపూర్                            
2.హైదరాబాద్-నాందేడ్             శివంపేట                            
3.హైదరాబాద్ -మెదక్              పెద్ద చింతకుంట               
4.హైదరాబాద్ -నాగ్ పూర్         ఇస్లాంపూర్                      
5. తూఫ్రాన్- గజ్వేల్                 మెంటూర్                            
6. హైదరాబాద్ - మంచిర్యాల     ప్రజ్ఞాపూర్                 
7. ప్రజ్ఞాపూర్- భువనగిరి          పీర్లపల్లి                             
8. యాదాద్రి-కీసర                  దత్తాయిపల్లి                         
9. హైదరాబాద్ -వరంగల్          రాయగిరి                      
10. భువనగిరి- నల్లగొండ         రెడ్ల రేపాక                       
11. హైదరాబాద్ -విజయవాడ      చౌటుప్పల్

click me!