Agnipath Protest In Secunderabad ఆవుల సుబ్బారావు అరెస్ట్:అనుచరులతో విధ్వంసానికి ప్లాన్

Published : Jun 24, 2022, 02:10 PM ISTUpdated : Jun 24, 2022, 02:16 PM IST
 Agnipath Protest In Secunderabad ఆవుల సుబ్బారావు అరెస్ట్:అనుచరులతో విధ్వంసానికి ప్లాన్

సారాంశం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు కీలక పాత్ర పోషించారని రైల్వే పోలీసులు గుర్తించారు.   

హైదరాబాద్: Secunderabad Railway Staion లో జరిగిన విధ్వంసం కేసులో Sai defence అకాడమీకి చెందిన  Avula Subba Rao కీలకంగా వ్యవహరించారని Railway SIT పోలీసులు గుర్తించారు. శుక్రవారం నాడు ఆయనను అరెస్ట్ చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్  ఎన్టీవీ చానెల్ ప్రకటించింది.  ఈ నెల 18వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం చోటు చేసుకుంది.  

మరో ఆరు డిఫెన్స్ కోచింగ్ సెంటర్లతో కలిసి విధ్వంసానికి స్కెచ్ ప్లాన్ చేశారని సమాచారం. శివ, మల్లారెడ్డి, హరి అనే అనుచరులతో కలిసి ఆవుల సుబ్బారావు విధ్వంసానికి పాల్పడ్డారని ఎన్టీవీ కథనం చెబుతుంది.  ఈ నెల 16న ఆవుల సుబ్బారావు Hyderabadకు చేరుకొన్నాడు. ఓ హోటల్ లో  అనుచరులతో కలిసి విధ్వంసానికి ప్లాన్ చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని ఈ కథనం వెల్లడించింది. 

ఆందోళనలు చేయాలని Whats App గ్రూపుల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని కూడా పోలీసులు గుర్తించారు.  మూడు రోజులుగా ఆవుల సుబ్బారావును  టాస్క్ పోర్స్ పోలీసులు, రైల్వే పోలీసులు  సుబ్బారావును విచారించిన సమయంలో కీలక విషయాలను పోలీసులు గుర్తించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాంతి యుతంగా ఆందోళన చేయాలని కోరినట్టుగా తొలుత పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని  సమాచారం. అయితే పోలీసులు తాము సేకరించిన ఆధారాలను  పోలీసులు సుబ్బారావు ముందు పెట్టి  ప్రశ్నించారు., ఆవుల సుబ్బారావు ఆదేశాల మేరకు తాము విధ్వంసానికి పాల్పడినట్టుగా కొందరు ఆర్మీ అభ్యర్ధులు పోలీసుల విచారణలొ ఒప్పుకున్నారని కథనం తెలిపింది. ఇవాళ సాయంత్రం లోపుగా సుబ్బారావును రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని సమాచారం.

సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 12 సెంటర్లతో పాటు మరో ఆరు డిఫెన్స్ అకాడమీలతో కూడా ఆవుల సుబ్బారావు మాట్లాడారని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఆరు డిఫెన్స్ అకాడమీలపై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. విధ్వంసం జరిగిన రోజు రాత్రి 9 గంటల వరకు ఆవుల సుబ్బారావు బోడుప్పల్ లోని తన డిఫెన్స్ అకాడమీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో సుబ్బారావు కారులో గుంటూరుకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని పోలీసులు గుర్తించారు.

హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్‌లో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్టులు పెట్టారని.. ఆందోళనకు కావల్సిన లాజిస్టిక్స్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్ధిగా పోలీసులుు గుర్తించారు. 

also read:ఐఎస్ఐ ఉగ్రవాదుల కంటే తీవ్రమైన సెక్షన్లు: చంచల్‌గూడ జైల్లో ఆర్మీ అభ్యర్ధులకు రేవంత్ పరామర్శ

ఈ కేసులో ఇప్పటివరకు 63మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 55మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి సంబంధించి సేకరించిన ప్రాథమిక ఆధారాలు, అరెస్టయిన నిందితుల నుంచి రికార్డు చేసిన వాంగ్మూలాలను బుధవారం కోర్టుకు సమర్పించారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?