పోలేపల్లి సెజ్‌లో కాలుష్య కంపెనీలపై ఉదారత ఎందుకు: ఎన్జీటీ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jan 15, 2021, 4:12 PM IST
Highlights

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి సెజ్ లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించింది.
 


న్యూఢిల్లీ: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి సెజ్ లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహించింది.

పోలేపల్లి సెజ్ లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నాడు విచారణ నిర్వహించింది.  పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన 9 ఔషధ సంస్థలకు జరిమానా విధించినట్టుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీటికి తెలిపింది.

హెటిరో ల్యాబ్స్, శిల్పా మెడికేర్, అరబిందో ఫార్మా, ఏపీఎల్ హెల్త్ కేర్, మైదాన్ లాబోరేటరీస్, ఎవెర్టోజెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమ్నీల్ అంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రూ. 18.25 లక్షలు, శ్రీకార్తీకేయ ఫార్మా కంపెనీకి రూ. 9 లక్షల జరిమానా విధించినట్టుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.

పర్యావరణ అనుమతలు ఉల్లంఘన రుసుమును 365 ఉల్లంఘన దినాలకు మాత్రమే వర్తింపజేయడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 

ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మెన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ప్రశ్నించారు. పరిశ్రమలతో చర్చించిన తర్వాత 365 ఉల్లంఘన దినాలకు అపరాధ రుసుమును విధించినట్టుగా తెలంగాణ పీసీబీ తరపు న్యాయవాది ఎన్జీటీకి తెలిపారు.

ఉల్లంఘనలు గుర్తించిన అన్ని రోజులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.
 

click me!