palamuru Rangareddy lift irrigation:పర్యావరణ, ఫారెస్ట్ శాఖలపై ఎన్జీటీ ఆగ్రహం

By narsimha lodeFirst Published Sep 27, 2021, 10:07 PM IST
Highlights


పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పర్యావరణ, అటవీ శాఖల వ్యవహరంపై ఎన్జీటీ  ఆగ్రహం వ్యక్తం చేసింది.అక్టోబర్ 1వ తేదీ లోపుగా నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని ఆదేశించింది ఎన్జీటీ.

హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై(palamuru Rangareddy lift irrigation) పర్యావరణ, అటవీశాఖల వ్యవహరశైలిపై ఎన్జీటీ (national green tribunal) ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.చర్యలకు ఆదేశించే వరకు అధికారుల్లో కదలిక ఎందుకు రాలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. ఈ ప్రాజెక్టుపై ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును (krmb) ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.అటవీ, పర్యావరణ శాఖలకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా నది జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకొనేందుు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని ఏపీ సర్కార్ వాదిస్తోంది. అయితే  తమ రాష్ట్రానికి దక్కాల్సిన  వాటా మేరకు నీటిని వాడుకొనేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలంగాణ చెబుతుంది.మరో వైపు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 

click me!