
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ (cyclone gulab) కారణంగా ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలో ప్రభుత్వ, (government)ప్రైవేట్ (private offices)కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు (holiday) ప్రకటించింది. అత్యవసర రంగాలకు సెలవు నుండి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
also read:గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో కుండపోత,లోతట్టు ప్రాంతాలు జలమయం
గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని 14 జాల్లాలకు వాతావరణశాఖ (IMD warning)హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.హైద్రాబాద్ నగరంలోని సోమవారం నాడు భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రధాన రోడ్లలో వరద నీరు పోటెత్తింది.హైద్రాబాద్ లో సుమారు 8 నుండి 10 గంటల పాటు వర్షం కురిసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ (KCR) సీఎస్ సహా ఉన్నతాధికారులతో తుఫాన్ పై సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది.విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్. అత్యవసర సర్వీసు విభాగాల్లో పనిచేసేవారికి సెలవు నుండి మినహాయించారు.రాష్ట్రంలో వర్ష ప్రభావంపై కేసీఆర్ సమీక్షించారు.