పంచాయితీరాజ్ శాఖపై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి

By narsimha lodeFirst Published Sep 27, 2021, 7:24 PM IST
Highlights

పంచాయితీరాజ్ శాఖ తీరుపై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ శాఖలో సమస్యలను కవిత ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో సౌకర్యాలు లేవని ఆమె చెప్పారు.

హైదరాబాద్: పంచాయితీరాజ్ శాఖ తీరుపై (panchayat raj) ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా (MLC)తొలిసారిగా శాసనమండలిలో  సోమవారం నాడు ఆమె ప్రసంగించారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ఎంపీపీలకు తగిన సౌకర్యాలు లేవని ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.  కొత్తగా మండలాల్లో సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కొత్తగా ఏర్పాటైన మండలాల్లో  కనీస సౌకర్యాలు లేక ఎంపీపీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. ఆయా మండలాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జాతీయజెండా ఎగురవేసేందుకు ఎంపీటీసీలకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు. అయితే ఈ విషయమై అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆమె కోరారు.

click me!