దివీస్ ఫ్యాక్టరీకి ఎన్జీటీ నోటీసులు: రెండు నెలల్లో నివేదిక

By narsimha lodeFirst Published Jun 10, 2020, 3:18 PM IST
Highlights

 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది.


హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది.

చౌటుప్పల్ కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి  దివీస్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న కాలుష్యంపై  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది.

దివీస్ ఫ్యాక్టరీ కాలుష్యంపై విచారణ చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్ ను చేర్చింది. 

also read:కేటీఆర్‌కి ఊరట: ఏన్జీటీ నోటీసులపై హైకోర్టు స్టే

చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు మాసాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి కాలుష్యానికి కారణమైతే ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది.

click me!