సహనం, సంయమనంతో మాట్లాడాలి: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లకు కేసీఆర్ సూచన

Published : Feb 11, 2021, 04:25 PM ISTUpdated : Feb 11, 2021, 04:46 PM IST
సహనం, సంయమనంతో మాట్లాడాలి: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లకు కేసీఆర్ సూచన

సారాంశం

పదవుల్లో ఉన్నవాళ్లు సహనం, సంయమనం పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు సూచించారు.

హైదరాబాద్: పదవుల్లో ఉన్నవాళ్లు సహనం, సంయమనం పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు సూచించారు.హైద్రాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైన తర్వాత నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ , కార్పోరేటర్లను గురువారం నాడు సీఎం కేసీఆర్ ను కలిశారు. 

also read:జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక(ఫోటోలు)

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు.అసందర్భంగా అవసరం లేని మాటలు మాట్లాడొద్దని  కేసీఆర్ సూచించారు. అసందర్భ ప్రేలాపనలు కొన్నిసార్లు వికటిస్తాయని ఆయన చెప్పారు.ప్రజాప్రతినిదులుగా అందరికీ అవకాశం రాదన్నారు కేసీఆర్. మంచిగా ఉంటేనే బట్టకాల్చి మీద వేసే రోజులివి ఆయన అభిప్రాయపడ్డారు.

also read:అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రస్థానం

హైద్రాబాద్ మినీ ఇండియా మారుతోందన్నారు. భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచేలా పనిచేయాలని ఆయన కొత్త ప్రజా ప్రతినిదులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేయాలని ఆయన కోరారు. మేయర్ కు కావాల్సిన అర్హతలు  చాలా మందికి ఉన్నాయన్నారు. కానీ అందరికీ అవకాశం ఇవ్వలేమన్నారు.ఈ విషయాన్ని  అర్ధం చేసుకొని కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?