పెళ్లికాకుండానే గర్భం... పుట్టిన పసిగుడ్డును చెత్తకుప్పలో విసిరేసిన ఇంటర్ బాలిక

Arun Kumar P   | Asianet News
Published : Aug 22, 2021, 08:28 AM IST
పెళ్లికాకుండానే గర్భం...  పుట్టిన పసిగుడ్డును చెత్తకుప్పలో విసిరేసిన ఇంటర్ బాలిక

సారాంశం

తెలిసీ తెలియని వయసులు ప్రేమ వలలో పడిన ఓ బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసిగుడ్డును చెత్తకుప్పలో విసిరేయగా ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానవీయ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. 

నిజామాబాద్: ఓ వంచకుడి కామవాంఛకు ఓ మైనర్ బాలిక గర్భం దాల్చడమే కాదు ఓ పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయింది. బాలికను ప్రేమ పేరిట వలలో వేసుకుని శారీరక సుఖాన్ని పొందినవాడు ఆమె గర్భవతి అని తెలియగానే ముఖం చాటేశాడు. దీంతో బాలిక ప్రసవించిన బిడ్డను చెత్తకుప్పలో పడేయగా ఆ పసిగుడ్డు ప్రాణాలు వదిలింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భోదన్(17)లో ఓ మైనర్ బాలిక చదువుకుంటోంది. అమ్మమ్మ వారి ఇంటివద్ద వుంటూ చదువుకునేది. తెలిసీ తెలియని వయసులో వున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అతడిది నిజమైన ప్రేమగా భావించిన బాలిక వలలో పడింది. అతడితో బాలిక శారీరకంగా కూడా దగ్గరయ్యింది. 

పలుమార్లు బాలిక ప్రియుడితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. చాలా ఆలస్యం అయ్యాక ఆమె గర్భం దాల్చిన విషయం తెలియడంతో అబార్షన్ కూడా చేయించలేకపోయారు. దీంతో అమ్మమ్మవారి ఇంటివద్దే వుంటూ గర్భాన్ని మోసింది. తాజాగా నెలలు నిండటంతో బాలికకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అమ్మమ్మ ఆమెను నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అక్కడ సిబ్బంది వీరి వివరాలు అడగడంతో బయటపెట్టడం ఇష్టంలేక ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. 

read more  శాడిస్ట్ లవర్... ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో

అయితే ప్రైవేట్ హాస్పిటల్ కు వెళుతుండగానే బాలికకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో హాస్పిటల్ మెట్లకిందే ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. వెంటనే బాలికతో ఆమె అమ్మమ్మ ఆ శిశువును పక్కనే వున్న  చెత్తకుప్పలో పడేశారు. తమకేమీ తెలియదన్నట్లుగా హాస్పిటల్ లోకి వెళ్లిపోయారు. 

చెత్తకుప్పలో పడివున్న శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని శిశువున్న హాస్పిటల్ కు తరలించారు. కానీ అక్కడ చికిత్స అందేలోపే పసివాడు ప్రాణం వదిలాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలికను గుర్తించారు. ఆమె నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 

 


 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu