తెలంగాణ: కొత్తగా 364 మందికి పాజిటివ్.. 6,54,758కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Aug 21, 2021, 09:51 PM IST
తెలంగాణ: కొత్తగా 364 మందికి పాజిటివ్.. 6,54,758కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 364 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 482 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6608 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో గత 24గంటల్లో 75,289 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 364 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,54,758కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 3,856కి చేరింది. కోవిడ్ మహమ్మారి బారి నుంచి నిన్న 482 మంది కోలుకున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో రికవరీల సంఖ్య 6,44,294కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 6,608 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 7, జీహెచ్ఎంసీ 76, జగిత్యాల 18, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 4, కరీంనగర్ 44, ఖమ్మం 12, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 8, మంచిర్యాల 8, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 20, ములుగు 4, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 22, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 4, పెద్దపల్లి 13, సిరిసిల్ల 13, రంగారెడ్డి 21, సిద్దిపేట 13, సంగారెడ్డి 5, సూర్యాపేట 11, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 22, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu