Asianet News TeluguAsianet News Telugu

శాడిస్ట్ లవర్... ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో

ప్రేమ పేరుతో నమ్మించి యువతి నుండి నగ్న ఫోటోలు, వీడియోలు సంపాదించిన ఓ శాడిస్ట్ యువకుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టి రాక్షసానందం పొందాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

vijayawada... Lover Posts girl Obscene Video On Social Media
Author
Vijayawada, First Published Aug 22, 2021, 7:41 AM IST

విజయవాడ: ప్రేమించిన వాడే యువతిని నమ్మించి నయవంచన చేశాడు. అతడి కపటప్రేమ నిజమేనని నమ్మిన యువతి ఏం చెబితే అది చేసింది. చివరకు తన నగ్న ఫోటోలు, వీడియోలు కూడా పంపింది. అదే ఇప్పుడు ఆమెను ఇబ్బందులపాలు చేసింది. ప్రియుడే ఓ స్నేహితుడి సాయంతో యువతి నగ్న వీడియోలు సోషల్ మీడియాతో పోస్ట్ చేసి రాక్షసానందం పొందాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే...  బీహార్ కు చెందిన రోహిత్ కుమార్ ఉపాధి నిమిత్తం విజయవాడలో నివాసముంటున్నాడు. మూడేళ్లుగా అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సదరు యువతి అతడి ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. అతన్ని పూర్తిగా నమ్మిన ఆమె ఏ అమ్మాయి చేయని పని చేసింది. ప్రియుడు కోరాడని తన నగ్న ఫోటోలు, వీడియోలను అతడికి పంపించింది. ఇవి చేతిలో పడ్డాక రోహిత్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. 

read more  పదో తరగతి బాలికతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి, సస్సెండ్...

యువతి నగ్న ఫోటోలు, వీడియోలను తన స్నేహితుడు గణేష్ కు పంపించాడు రోహిత్. అంతేకాదు వీరిద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఖాతా తెరిచి యువతి ఫోటోలను అందులో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న యువతి ఇది రోహిత్ పనేనని గుర్తించింది. దీంతో వెంటనే ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. 

యువతి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు రోహిత్ తో పాటు అతడి స్నేహితుడు గణేష్ ను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. వారి సెల ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులకు కోర్టులో హాజరుపర్చగా మూడు రోజుల రిమాండ్ విధించారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios