నౌహీరా కేసులో కీలక మలుపు... రియల్ ఎస్టేట్ సంస్థలకు స్థలాల విక్రయాలు, ఈడీ సోదాల్లో వెలుగులోకి

By Siva KodatiFirst Published Dec 14, 2022, 5:39 PM IST
Highlights

నౌహీరా షేక్ కేసు కీలక మలుపు తిరిగింది. పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు నౌహీరా స్థలాలు అమ్మినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో షోలాపూర్ సత్వాకు సంబంధించి రూ.78 కోట్లు ఆస్తులు అటాచ్ చేశారు
 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నౌహీరా షేక్ కేసు కీలక మలుపు తిరిగింది. పెట్టుబడుల పేరుతో రూ.5 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు నౌహీరా షేక్ స్థలాలు అమ్మింది. ఈ క్రమంలోనే షోలాపూర్ సత్వా సంస్థకు స్థలాలు అమ్మింది నౌహీరా. గత నెలలో షోలాపూర్ సత్వా కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. షోలాపూర్ సత్వా, ఎస్ఏ బిల్డర్స్, నీలాంచల్ టెక్నో క్యాట్స్‌లో అక్రమాలు గుర్తించారు ఈడీ అధికారులు. షోలాపూర్ సత్వాకు సంబంధించి రూ.78 కోట్లు ఆస్తులు అటాచ్ చేశారు. పలు షెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేసింది నౌహీరా షేక్. ఎస్ఏ బిల్డర్స్‌కి రూ.148 కోట్లు బదిలీ చేసినట్లుగా గుర్తించారు. 

ఇదిలావుండగా... హీరా గోల్డ్ స్కాం కేసుకు సంబంధించి ఆ సంస్థ ఛైర్మన్ నౌహీరా షేక్‌కు గతేడాది సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ సంస్థ డేటాను ఉపయోగించుకొనేందుకు నౌహీరా షేక్ కు ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. నౌహీరా షేక్ ను అరెస్ట్ చేసిన సమయంలో ఆ సంస్థకు చెందిన డేటాను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పోలీసులు తరలించారు. 

ALso REad:హీరా గోల్డ్ స్కాం: నౌహీరా షేక్‌‌కు సుప్రీంలో ఊరట

అయితే ఈ డేటా కోసం నౌహీరా షేక్ కోర్టును ఆశ్రయించింది. ఈ డేటాను ఉపయోగించుకొనేందుకు పోలీసులు అంగీకరించారు. ఈ డేటా వివరాలను మరో హార్డ్ డిస్క్ లో కాపీ చేసి నౌహీరా షేక్ కు పోలీసులు అందించారు. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో  నౌహీరా షేక్ ను 2018 అక్టోబర్ 17న హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 కంపెనీలకు నౌహీరా షేక్ ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు. వేర్వేరు పేర్లతో ఈ కంపెనీలు నడిపారు.

click me!