సునీల్ కనుగోలు ప్రధాన నిందితుడు.. ముగ్గురికి నోటీసులు మాత్రమే ఇచ్చాం: జాయింట్ సీపీ

By Sumanth KanukulaFirst Published Dec 14, 2022, 4:19 PM IST
Highlights

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై సోదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై సోదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సీసీఎస్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు రావడంతో సోదాలు జరిపినట్టుగా చెప్పారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నారని.. టెక్నాలజీ సాయంతో లోకేషన్‌ను కనుక్కున్నామని చెప్పారు. మహిళల విషయంలో అసభ్యంగా ఎవరూ పెట్టినా చర్యలు తప్పవని తెలిపారు. మహిళలను కించపరచడాన్ని వ్యంగ్యం అని పేర్కొనలేమని  చెప్పారు. 

ఇందుకు సంబంధించి లీగల్‌గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఒక కేసు.. మిలిగిన పోలీసు స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయని అన్నారు. మంగళవారం ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని.. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన పంపించడం జరిగిందన్నారు. 10 ల్యాప్‌ ట్యాప్స్, మొబైల్ ఫోన్స్‌ను సీజ్ చేసినట్టుగా చెప్పారు. చట్టప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని చెప్పారు. 

అయితే చాలా రహస్యంగా ఈ ఆఫీసును నిర్వహిస్తున్నారని చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్న ముగ్గురు కూడా ఈ ఆఫీసు సునీల్ కనుగోలు కింద వీళ్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కేసులో సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడు అవ్వనున్నట్టుగా చెప్పారు. ఈ కేసులో నోటీసులు మాత్రమే ఇచ్చామని.. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. 

వీరు 6 నెలల నుంచి ఈ పని చేస్తున్నారని జాయింట్ సీపీ అన్నారు. ఆ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ అని వాళ్లు అంటున్నారని.. అయితే అది కాంగ్రెస్ వారు రూమ్ అనేది తమకు తెలియదని చెప్పారు. అంత రహస్యంగా ఎవరికి తెలియని చోట పెట్టుకుంటారని తనకు తెలియదని అన్నారు. అది కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీసు తాము ఇంకా నిర్దారించలేదని అన్నారు. అది ఒక ఆఫీసు మాత్రమేనని.. అది మైన్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో రిజిస్టర్ అయింది.. అక్కడ ఏ బోర్డు లేదని చెప్పారు. ఇక, సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన ఫిర్యాదులపై జాయింట్ సీపీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రం మోడీ వచ్చి స్వయంగా కంప్లైంట్ చేయలేరు కదా ? అని ప్రశ్నించారు.

click me!