టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు : వెలుగులోకి కొత్త గ్యాంగ్.. ముఠా నాయకుడు విద్యుత్ శాఖ డీఈ , 20 మందితో బేరం

By Siva KodatiFirst Published May 28, 2023, 3:09 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వేకొద్దీ ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ అభ్యర్ధులతో పరిచయాలు పెంచుకుని ప్రశ్నాపత్రం విక్రయించినట్లుగా సిట్ గుర్తించింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో వెలుగులోకి కొత్త కోణం వచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో 43 మంది నిందితులను సిట్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు ఈ కేసులో తెరపైకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు 20 మందికి ప్రశ్నాపత్రాలు విక్రయించినట్లుగా సిట్ గుర్తించింది.

ఇతను వరంగల్‌లో ఓ కోచింగ్ సెంటర్ శిక్షకుడిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్ధులతో పరిచయం పెంచుకుని దందాకు తెరలేపినట్లుగా సిట్ గుర్తించింది. పరీక్ష రాసి టాప్ మార్కులు సాధించిన వారిపై సిట్ ఫోకస్ పెట్టింది . ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిశోర్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!