తెలుగు అకాడమీ స్కాంలో ట్విస్ట్: ఏపీ డబ్బులూ కొట్టేసిన సాయికుమార్ గ్యాంగ్.. 15 కోట్ల మేర డ్రా

By Siva Kodati  |  First Published Oct 12, 2021, 8:10 PM IST

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్.


రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్. ఆలాగే ఏపీ సీడ్స్ కార్పోరేషన్ (ap seeds corporation) నుంచి ఐదు కోట్ల ఎఫ్‌డీలను కూడా డ్రా చేశాడని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఏపీకి చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు డ్రా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏపీ సంస్థలకు సంబంధించిన డిపాజిట్లను ఐఓబీ బ్యాంక్ (IOB bank) నుంచి బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (ap govt) సీసీఎస్ పోలీసులు (ccs police) సమాచారం అందించారు. సాయికుమార్ ముఠాపై 2 కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగు అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై దృష్టిపెట్టారు. 

మరోవైపు తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో నిందితులు సిసీఎస్ పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది. తాము కొల్లగొట్టిన 64 కోట్ల రూపాయలను నిందితులు ఏం చేశారనేది తేలడం లేదు. Telugu Akademi scam కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వారిలో 9 మందిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు 

Latest Videos

Also Read:Telugu AKademi Scam : స్కామ్ సొమ్ముతో వివాదాస్పద భూముల కొనుగోలు.. అవే ఎందుకంటే...

పోలీసుల ప్రశ్నలకు సోమవారంనాడు నిందితులు వింత జవాబులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఖర్చులు పెరిగాయని, దాంతో పెద్ద యెత్తున అప్పులు చేశామని, ఆ అప్పులు తీర్చడానికే ఈ అక్రమానికి పాల్పడ్డామని నిందితుల్లో కొందరు చెప్పినట్లు తెలుస్తోంది. కావాలనే వాళ్లు వాస్తవాలను దాస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. తెలుగు అకాడమీ కుంభకోణం వెనక మరో నలుగురి ప్రమేయం ఉండవచ్చునని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో వారు దర్యాప్తు సాగిస్తున్నారు.

అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి (somireddy) వ్యక్తిగత సహయకుడు సురభి వినయ్ కుమార్ ను (vinay kumar) కస్టడీకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటపడవచ్చునని భావిస్తున్నారు. నిందితులు కొల్లగొట్టిన రూ.64 కోట్లలో పోలీసులు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బులతో నిందితులు స్థలాలు, ఆభరణాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తిచారు. అటువంటి ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 

click me!