అప్సర హత్య కేసులో కొత్త ట్విస్ట్...సీన్ లోకి కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో !...

By SumaBala Bukka  |  First Published Jun 12, 2023, 9:03 AM IST

అప్సర హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఆమెకు అంతకుముందు పెళ్లైందని.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. అతని మృతికి అప్సర వేధింపులే కారణం అని తెలుస్తోంది. 


హైదరాబాద్ : శంషాబాద్ అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అప్సరకు ఇంతకు ముందే పెళ్లైందని.. భర్తతో కలిసి ఉన్న ఫొటోలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫొటోల్లో ఉన్న కార్తీక్ రాజా అనే వ్యక్తి తల్లి ధనలక్ష్మి ఓ ఆడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. తన కొడుకు కార్తీక్ రాజు ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి వేధింపులే కారణం అంటూ ఆమె చెప్పడం ఇప్పుడు కేసులో మరో ట్విస్ట్ తెరలేపింది. 

వివరాల్లోకి వెడితే.. చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత డబ్బుల కోసం, టూర్లకు వెళ్లాలంటూ అప్సర తన కొడుకును వేధించేదని.. లగ్జరీ లైఫ్ కోసం అతడిని హింసించేదని కార్తీక్ తల్లి ధనలక్ష్మి తెలిపింది. అప్సర, ఆమె తల్లి అరుణల వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆడియోలో పేర్కొంది. 

Latest Videos

undefined

హైదరాబాద్ శంషాబాద్ లో దారుణం.. ప్రియురాలిని చంపి మ్యాన్ హోల్ లో దాచిపెట్టిన ప్రియుడు..

కార్తీక్ రాజా మీద ఒకసారి అప్సర పోలీస్ కేసు కూడా పెట్టిందని...దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని తెలిపింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని.. ఆమె తన ఆడియోలో తెలిపింది. ఆ తరువాతి నుంచి అప్సర, ఆమె తల్లి అరుణ కనిపించలేదన్నారు. 

దీంతో ఇప్పుడు అప్సరకు అంతకుముందే పెళ్లయిందా?.. ఈ విషయం అప్సర ఇంట్లో తెలుసా..?  ధనలక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఫోటోల్లో అప్సరతో పాటు ఉన్నది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయికృష్ణ తండ్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత మూడు నెలలుగా తన కొడుకును అప్సర తీవ్రంగా వేధిస్తోందని.. టార్చర్ భరించలేకపోతున్నానని కొడుకు అన్నాడని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ శంషాబాద్ లో కలకలం సృష్టించిన అప్సర హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. అప్సర తల్లి మాట్లాడుతూ... ‘అప్సర మూడో తేదీ కోయంబత్తూర్ వెడతానని చెప్పి వెళ్లింది. బస్సులో వెడుతున్నానని చెప్పింది. తరువాత ఫోన్ కలవలేదు. దీంతో స్నేహితుడైన సాయికృష్ణకు పదే పదే ఫోన్లు చేసినా ఎత్తలేదు. ఆ తరువాత ఆదివారం సాయికృష్ణ మా ఇంటికి వచ్చాడు. అప్సర స్నేహితులతో భద్రాచలం వెడతానంటే తానే భద్రాచలం పంపించానని చెప్పాడు. నువ్వెలా పంపిస్తావు.. నీకేం అధికారం ఉందని.. సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదా అన్నా.. దానికి సమాధానం దాట వేశాడు. 

సాయికృష్ణ, అప్సర స్నేహితులు.. మంచిపిల్లాడు, మన బ్రాహ్మణ పిల్లాడే కదా అనుకున్నాం.. కానీ ఇలా చేస్తాడని తెలియదు. కానీ అతను ఆదివారం వచ్చి చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇంట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమీ చూడడం లేదు. తన కూతురు పదిహేనేళ్ల క్రితం తమిళ సినిమాలో ఒ చిన్న పాత్ర వేసింది. సినిమాలు వద్దని ఇంటికి తీసుకువచ్చేశాం. ఇంట్లోనే ఉంటుంది. గుడికి వెళ్లే క్రమంలో సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. మేము మొదట్లో చెన్నైలో ఉండేవాళ్లం. ఆ తరువాత సొంత ప్రాంతం అని హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డాం. మా భర్త కాశీలో ఉంటాడు. అతను పంపించే డబ్బులతో మేము హాయిగా ఉంటున్నాం...’ అని చెప్పుకొచ్చారు. 

అంతేకాదు తమ కులస్తుడే కాబట్టి తాము అనుమానించలేదని.. ఒక పురోహితుడు ఇలా చేయగలడని ఎవరైనా ఊహిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుడికి ఎవరైనా ఎలా వస్తారని ప్రశ్నించారు. తనకు కూతురు చనిపోయిన సంగతి తెలియదన్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సాయికృష్ణ కేవలం స్నేహితుడేనని అన్నారు. 

click me!