శిరీష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి.. అత్యాచారం చేసి, హత్య చేసిన బావ...

By SumaBala Bukka  |  First Published Jun 12, 2023, 7:20 AM IST

వికారాబాద్ శిరీష హత్య కేసులో.. మృతురాలికి పోస్టు మార్టం పూర్తయ్యింది. మృతదేమాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. 


వికారాబాద్ : తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన శిరీష హత్య కేసులో నిందితుడు బావే అని తేలింది. శిరీష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేడు కలాపూర్ లో శిరీష అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు తేల్చారు. అక్క భర్తతో శిరీషకు వివాహేతర సంబంధం ఉందని.. ఈ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగిందని అంటున్నారు.

శనివారం రాత్రి శిరీషను బైటికి రావాలని బావ పిలవడంతో ఆమె బైటికి వచ్చింది. అక్కడినుంచి ఆమెను తీసుకువెళ్లి.. ఆమె మీద అత్యాచారం చేసి, కళ్లలో పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత సమీప కాలువలో పడేశారు. ఈ నేపథ్యంలో శిరీష పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనుంది. 

Latest Videos

వికారాబాద్ శిరీష కేసు : అన్ని వేళ్లూ అతడిపైనే.. ఆ రాత్రి ఏం జరిగింది, మిస్టరీ ఛేదించే యత్నాల్లో పోలీసులు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కలాపూర్ గ్రామంలో ఇంటర్ విద్యార్ధిని శిరీష హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా శనివారం రాత్రి ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తల్లి అనారోగ్యం కారణంగా శిరీష నిమ్స్‌లో చికిత్స తీసుకుంటోంది. తండ్రి, సోదరుడు మాత్రమే నిన్న రాత్రి ఇంట్లో వున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అక్క భర్త అనిల్‌తో వాగ్వాదం జరిగిందని.. అతను శిరీష మీద చేయి చేసుకున్నట్లుగా సమాచారం. 

ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శిరీష.. ఆ తరువాత ఇంటికి దగ్గరలోని నీటి కుంటలో శవమై తేలింది. శిరీష మృతితో ప్రస్తుతం అందరి అనుమానం అక్క భర్త అనిల్ మీదికే మళ్లుతుంది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శిరీష తండ్రిని, అన్నను ఇప్పటికే ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ముందుగా ఈ కేసు మీద మాట్లాడుతూ.. బావ అనిల్ కొట్టడం వల్ల మనస్తాపానికి గురై శిరీష బయటకు వెళ్లిందని తెలిపారు. కాగా, ఆమెను ఒక్కరే హతమార్చి వుంటారని తాము భావించడం లేదని, త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ఈ ఘటనపై మృతురాలి సోదరి శ్రీలత మాట్లాడుతూ.. ఇంటినుంచి వెళ్లిన శిరీష.. తమ ఇంటికి దగ్గరలోనే వున్న నీటి గుంటలో శిరీష శవమై తేలిందన్నారు. తమ కుటుంబానికి ఎవరి మీదా అనుమానం లేదని తెలిపింది. శిరీష మొబైల్ ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం తెలియవచ్చని అన్నారు. చివరిసారిగా శనివారం రాత్రి శిరీష బయటకు వెళ్లిందని.. అలా వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదని, ఆ లోపే ఈ ఘోరం జరిగిందని శ్రీలత కన్నీటి పర్యంతమైంది. 

ఎంతకూ ఇంటికి రాకపోవడంతో గ్రామంలో వెతికామని, తెలిసినవాళ్లను ఎంక్వైరీ చేశామని చెప్పింది. ఈ క్రమంలోనే శిరీష మృతదేహాన్ని నీటి గుంతలో చూశామని శ్రీలత వెల్లడించింది. తన తల్లి అనారోగ్యం కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ఇంట్లో తాను, తమ అన్న, శిరీష, తమ్ముడు వుంటున్నామని చెప్పింది. 

click me!