
TS Mandali Protem chairman : గత కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న శాసన మండలి ఛైర్మన్ ఎంపికపై అధికార టీఆర్ ఎస్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. త్వరలోనే శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ స్థానం ఖాళీ అవుతుండటంతో నెక్ట్స్ ఎవరన్నదానిపై అధికార పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. మరీ ఈసారి సీఎం కేసీఆర్ ఎవరి ఛాన్స్ ఇస్తారన్నదీ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ప్రస్తుతం.. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌గా మెదక్ జిల్లా స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల ఎమ్మెల్సీ సభ్యత్వ కాలం జూన్ మూడో తేదీతో ముగిసింది..అప్పట్లో కొత్త ఛైర్మన్ ఎన్నికతో పాటు ఖాళీ అయిన స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సభలో సీనియర్ సభ్యుడైన భూపాల్ రెడ్డిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి భూపాల్ రెడ్డి నే మండలి కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ఈ జనవరి 4వ తేదీతో పూర్తి కానున్నది. ఆయన తిరిగి పెద్దల సభకు ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. దీంతో మండలి కార్యకలాపాలు పర్యవేక్షించేవారు కరువయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ రెండు రోజుల్లోగా ఛైర్మన్ కోసం ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.
Read Also: అర్ధరాత్రుళ్లు ఇంట్లోకి వస్తున్నారు.. తెలంగాణ పోలీసులపై రేవంత్ ఆగ్రహం, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు
స్థానికసంస్థల కోటా నుంచి ఇటీవల ఎన్నికైన 12 మంది సభ్యుల పదవీకాలం ఐదో తేదీతో ప్రారంభం కానుంది. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 6 స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ నిర్వహించారు. అలాగే.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Also: ముందు రేవంత్‌ను పిలవండి.. తర్వాతే నేనొస్తా: చిన్నారెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్
ఆ రోజు తర్వాత వారు పెద్దలసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం ఒకవేళ నిర్ణయించినా వారి ప్రమాణస్వీకారం తర్వాతే ఉండే అవకాశం ఉంది. దీంతో మండలి రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా మరొకరిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించనున్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో సీనియర్‌గా ఉన్న ఒకరిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎమ్మెల్సీగా భూపాల్ రెడ్డి పదవీకాలం నాలుగోతేదీన పదవీకాలం ముగియనున్నడంతో ప్రొటెం ఛైర్మన్ నియామక నోటిఫికేషన్ కూడా అదే రోజు జారీ చేసే అవకాశం ఉంది. మరీ కొత్త ప్రొటెం ఛైర్మన్ , కొత్త ఛైర్మన్‌లను నియమించడం పక్కాగా కనిపిస్తోంది.
దీంతో .. ఆ పదవుల కోసం సీనియర్లంతా టీఆర్ఎస్ అధిష్టానంతో బేరాసారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రేసులో మాజీ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎల్. రమణ, బండ ప్రకాష్ ఉన్నట్టు తెలుస్తోంది. తిరిగి MLCగా ఎన్నిక అయినా.. గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నా.. ఆయన కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
Read Also: Telangana Omicron: ఇక నుంచి mask లేకపోతే.. అంతే.. CS సోమేష్ కుమార్ సీరియస్
మరోవైపు, డిప్యూటీ ఛైర్మన్ కోసం సీనియర్ ఎమ్మెల్సీలు MS ప్రభాకర్, పట్నం మహేందర్ రెడ్డి, కాచుకుంట్ల దామోదర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక, శాసనమండలి చీఫ్‌విప్‌తో పాటు కొన్ని విప్ పదవులు కూడా ఖాళీ అయ్యాయి. వీటికోసం కూడా పోటీ ఎక్కువగానే ఉంది. ఇందుకోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, నవీన్ కుమార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఏ నిర్ణయమైనా గులాబీ బాస్ కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఛైర్మన్, ప్రొటెం ఛైర్మన్ ఎవరనేది వేచి చూడాల్సిందే.