టార్గెట్ టీపీసీసీ చీఫ్ .. దీన్ని ఏమంటారు, శశిథరూర్‌పై రేవంత్ వ్యాఖ్యల్ని చిన్నారెడ్డికి పంపిన జగ్గారెడ్డి

By Siva Kodati  |  First Published Jan 1, 2022, 7:17 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో ప్రకటన చేశారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి జగ్గారెడ్డి లేఖ రాశారు. శశిథరూర్‌పై (shashi tharoor)గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వీడియోను చిన్నారెడ్డికి పంపారు జగ్గారెడ్డి.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో ప్రకటన చేశారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి జగ్గారెడ్డి లేఖ రాశారు. శశిథరూర్‌పై (shashi tharoor)గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వీడియోను చిన్నారెడ్డికి పంపారు జగ్గారెడ్డి. పార్టీ సీనియర్ నేతపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రేవంత్‌పై తానే ఫిర్యాదు చేస్తున్నానని.. ఆయనకు షోకాజ్ నోటీసులివ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. శశిథరూర్‌ని రేవంత్ అలా మాట్లాడటం తప్పుకాదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో రేవంత్ ఒంటెద్దు పోకడపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు క్రమశిక్షణ కమిటీకి కనపడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

కాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) వ్యవహారం టీపీసీసీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి (chinna reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ (tpcc chief) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని (revanth reddy) కూడా కమిటీ ముందుకు పిలవాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని తేల్చి చెప్పారు. 

Latest Videos

undefined

Also Read:ముందు రేవంత్‌ను పిలవండి.. తర్వాతే నేనొస్తా: చిన్నారెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్

సోనియా గాంధీకి (sonia gandhi) తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్‌ అయ్యిందో తెలియదన్న విషయం మీడియా ద్వారా కూడా వివరణ ఇచ్చినట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? లేక మీడియాలో వచ్చిన వార్తలను కమిటీ సుమోటోగా తీసుకున్నదా? అన్న విషయాన్ని చిన్నారెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించి పార్టీ లైన్‌ దాటిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా? అని జగ్గారెడ్డి నిలదీశారు. 

తన సొంత ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తనకు చెప్పకుండా కార్యక్రమం ప్రకటిస్తే అది క్రమశిక్షణ కిందకు రాదా? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిగా తాను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఇవాళ పత్రికల్లో చూశానని అన్నారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్‌రెడ్డిని పిలిచిన తరువాత.. నన్ను పిలిస్తే తప్పకుండా హాజరవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

click me!