ఎఫ్ సిఐ లో కొత్త ఉద్యోగాలు

First Published Jul 25, 2017, 5:16 PM IST
Highlights

ఎఫ్ సిఐ లో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మొత్తం పోస్టులు 271

దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 21

హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ) లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ ఆగస్టు 21 అని తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఏపీ, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాచ్మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం 271 పోస్టులను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)ను 1964లో ఏర్పాటుచేశారు. ఇది ఆహార ధాన్యం సరఫరా-గొలుసు నిర్వహణతో వ్యవహరించే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ.

 

పోస్టు పేరు : వాచ్మెన్

మొత్తం పోస్టులు : 271 (జనరల్-138, ఓబీసీ-73, ఎస్సీ-41, ఎస్టీ-19)

ప్రాంతాలవారీగా ఖాళీలు :

తెలంగాణ: 101 పోస్టులు ( జనరల్-51, ఓబీసీ-27, ఎస్సీ-16, ఎస్టీ-7)

ఆంధ్రప్రదేశ్: 158 పోస్టులు ( జనరల్-79, ఓబీసీ-43, ఎస్సీ-25, ఎస్టీ-11)

అండమాన్ నికోబార్ దీవులు: 12 పోస్టులు ( జనరల్-8, ఓబీసీ-3,ఎస్టీ-1)

 

అర్హత : గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత. 2017 జూలై 1 నాటికి అర్హత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2017 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్ : రూ. 8,100-18,070/-

అప్లికేషన్ ఫీజు : రూ. 250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

 

ఎంపిక విధానం : ఆబెక్టివ్ రాతపరీక్ష, పీఈటీ ద్వారా.

ఫిజికల్ ఎడ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ). ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

పరుగు పందెం : పురుష అభ్యర్థులు 1000 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 30 సెకండ్లలో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయాలి

హై జంప్ : పురుష అభ్యర్థులు 1.20 మీటర్లు, మహిళా అభ్యర్థులు 0.80 మీటర్లు

లాంగ్ జంప్ : పురుష అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళా అభ్యర్థులు 3.00 మీటర్లు

పీహెచ్ సి అభ్యర్థులకు పీఈటీ పరీక్ష మినహాయింపు ఉంది.

 

రాత పరీక్ష :

ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక భాష ఎంచుకొని పరీక్ష రాయవచ్చు. మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 120 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. రాతపరీక్ష తేదీ వివరాలను వెబ్సైట్ లేదా ఈ మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, శ్రీకాకులం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కర్నూల్, పోర్ట్ బ్లెయిర్ లలో ఏర్పాటు చేస్తారు.

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి.

వాడుకలో ఉన్న మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి

చిరునామా : FCI, Regional Office, HACA Bhawan, Opp. Public Gardens, Hyderabad -500 004

దరఖాస్తులకు చివరితేదీ : ఆగస్టు 21

పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు

వెబ్సైట్ :  www.fciregionaljobs.com

click me!