వీళ్లిద్దరూ పబ్ కు పోతారట

Published : Jul 25, 2017, 02:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
వీళ్లిద్దరూ పబ్ కు పోతారట

సారాంశం

రేవంత్, రఘునందన్ పబ్ కు పోతారట అందుకే వాళ్లు ఏదిపడితే అది మాట్లాడుతున్నారు హోంమంత్రి నాయిని సంచలన కామెంట్

వాళ్లిద్దరూ తెలంగాణ సర్కారును హడలెత్తిస్తున్నారు. సర్కారు తప్పులను ఎత్తిచూపుతూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ సర్కారు వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సూటిగా సుత్తిలేకుండా పదునైన విమర్శలకు దిగుతారు.

ఆధారాలు గణాంకాలతో అదరగొడతారు. పంచ్ డైలాగులతో హీటెక్కిస్తారు. గుక్క తిప్పుకోకుండా ప్రసంగిస్తారు. అధికార పక్షాన్ని నీళ్లు నమిలేలా చేస్తారు.

కానీ ఈ ఇద్దరు నాయకుల గురించి హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సంలచన ఆరోపణలు చేశారు.

టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఇద్దరిపై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వారిద్దరికీ పబ్ కు పోయే అలవాటుందని ఆరోపించారు నాయిని. అందుకే పబ్ ల గురించి, డ్రగ్స్ గురించి వారిద్దరూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు హోం మంత్రి.

మరి హోంమంత్రి నాయిని వ్యాఖ్యలపై వారిద్దరూ ఏరకంగా స్పందిస్తారో చూడాలి మరి.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..