కేసీఆర్ కేబినెట్: నమ్మకస్తులకే చోటు, కేటీఆర్ ముద్ర

First Published Feb 20, 2019, 12:11 PM IST

65 రోజుల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించారు.  తన మంత్రివర్గంలోని 10 మందికి కేసీఆర్ చోటు కల్పించారు. ఈ పది మంది కూడ కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులు

65 రోజుల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించారు. తన మంత్రివర్గంలోని 10 మందికి కేసీఆర్ చోటు కల్పించారు. ఈ పది మంది కూడ కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులు. మరో వైపు ఈ కేబినెట్ కూర్పులో కేటీఆర్ మార్కు స్పష్టంగా ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
undefined
తెలంగాణ సీఎంగా కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన ప్రమాణం చేశారు. ఆ రోజు తనతో పాటు మహమూద్ అలీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. మహమూద్ అలీకి హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు.
undefined
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కేసీఆర్ 65 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. 10 మందికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇందులో ఆరుగురు అగ్రవర్ణాలకు, ముగ్గురు బీసీలకు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చోటు కల్పించారు.
undefined
కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.
undefined
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో కేబినెట్ విస్తరణలో కేసీఆర్ కుటుంబసభ్యులను దూరం పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణలో కేటీఆర్, హరీష్‌లకు చోటు దక్కే అవకాశం లేకపోలేదు.
undefined
గత టర్మ్‌లో మంత్రులుగా పనిచేసిన కొందరు సీనియర్లకు ఈ దఫా కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కలేదు. గత టర్మ్‌లో పనిచేసిన నలుగురు మంత్రులకు ఈ దఫా కేబినెట్‌లో చోటు దక్కింది. వనపర్తి నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. గత టర్మ్‌లో నిరంజన్ రెడ్డి వనపర్తి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గత టర్మ్‌లో నిరంజన్ రెడ్డికి కేసీఆర్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
undefined
వరుసగా రెండు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. గత టర్మ్‌లో ప్రశాంత్ రెడ్డికి మిషన్ భగీరథ కార్పోరేషన్ వైస్ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు. ఈ దఫా ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.
undefined
టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్‌లో చేర్చడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు.
undefined
ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డిలు కూడ కేసీఆర్‌కు,కేటీఆర్‌లకు అత్యంత నమ్మకస్తులుగా మారారు. ఈటల రాజేందర్ కూడ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే ఈ దఫా ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టాలని భావించారు. కానీ, కేసీఆర్ ప్రతిపాదనను ఈటల అంగీకరించలేదు. మంత్రి పదవే కావాలని ఈటల కోరినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది.
undefined
పార్టీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ దఫా కేబినెట్లో సీనియర్లకు బదులుగా యువ రక్తానికి ఎక్కువగా కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
undefined
కేసీఆర్ తన మంత్రివర్గంలోకి మహిళను కానీ, గిరిజనులకు కానీ చోటు కల్పించలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ దఫా కేబినెట్‌లో చోటు దక్కని సీనియర్లకు కేసీఆర్ ఇతర పదవులను కట్టబెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
undefined
click me!