నేరేడుచర్ల చైర్మన్ ఎన్నికలో ఓటు వివాదం: కేవీ స్పందన ఇదీ...

By telugu teamFirst Published Jan 28, 2020, 9:26 PM IST
Highlights

నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో తన ఓటు హక్కుపై వివాదం చోటు చేసుకోవడాన్ని కేవీపి రామచందర్ రావు తప్పు పట్టారు. తనకు ఓటు ఎవరో ఇచ్చిన అవకాశం కాదని, అది తన హక్కు అని కేవీపీ అన్నారు.

సూర్యాపేట: నేరేడుచర్లలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకునే విషయంపై చెలరేగిన వివాదంపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యానని, 2014 నుంచి తెలంగాణలో జరిగిన ఐదు ఎన్నికల్లో తాను ఓటేశానని ఆయన చెప్పారు. 

తనకు అవకాశం ఇవ్వడం కాదు, ఇది తన హక్కు అని కేవీపీ అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలు కూడా తనకు అవసర లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంంలో కేవీపీ రామచందర్ రావును తెలంగాణకు టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. 

Also Read: మండలిపై జగన్ వ్యాఖ్యలకు కేకే కౌంటర్: కేవీపీ ఓటుపై కీలక వ్యాఖ్య

అయితే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు వాదన మరో విధంగా ఉంది. కే. కేశవరావు తుక్కుగుడా మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటేశారు. నేరేడుచర్లలో కేవీపీకి ఓటు హక్కు కల్పించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు 

తాను, కెవీపీ పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ లేఖలు ఇచ్చామని, అప్పటి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదేశాలు కూడా ఇచ్చారని, 2014లోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని కేకే వివరింంచారు. అందువల్ల కేవీపీకి తెలంగాణలో ఓటు హక్కు లేదని ఆయన అన్నారు. 

Also Read: నేరేడుచర్ల వివాదం: ఉత్తమ్, కేవీపీల అరెస్ట్, మిర్యాలగుడాకు తరలింపు

కేవీపీ రామచందర్ రావుకు ఓటు హక్కు కల్పించడంపై టీఆర్ఎస్ సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్ర గందరగోళం మధ్య చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. అయితే కేవీపీకీ ఓటు హక్కు ఉందని ఈసీ ధ్రువీకరించింది. 

click me!