టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

By narsimha lodeFirst Published Jan 28, 2020, 4:40 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం  మంగళవారం నాడు టీఆర్ఎస్‌ భవన్ లో ప్రారంభమైంది. 


హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం నాడు  సాయంత్రం తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది.  పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Also read:ఉత్తమ్‌కు షాక్: టీఆర్ఎస్ వశమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతరత్రా విషయాలపై పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. 

 నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా కేంద్రం తీరుపై అసంతృప్తితో ఉంది. ఈ విషయాలపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో  కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంది. 

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని చాలా కాలంగా టీఆర్ఎస్ సర్కార్ కోరుతోంది. కానీ, టీఆర్ఎస్ సర్కార్ మాత్రం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో  సానుకూలంగా స్పందించలేదు. ఈ విషయమై కూడ కేంద్రంపై టీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది.


 
 

click me!