డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: రాజకీయనేతలను అడ్డుకొన్న కాలనీవాసులు

By narsimha lode  |  First Published Dec 1, 2019, 2:11 PM IST

డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యతో బాధపడుతున్న కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ నేతలను కాలనీవాసులు అడ్డుకొన్నారు. 


హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులు నిరసనను కొనసాగిస్తున్నారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వాళ్ల ఇంటికి రాజకీయ పార్టీ నేతలు క్యూ కట్టారు. కానీ కాలనీ వాసులు గేటుకు తాళం వేసి డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను కలవకుండా అడ్డుకొన్నారు. రేవంత్ రెడ్డి సహా, సీపీఐ, సీపీఎం నేతలను కాలనీ వాసులు అడ్డుకొన్నారు.చివరకు రేవంత్ రెడ్డి ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.

Also read:డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: చర్లపల్లి జైలు ముందు ఉద్రిక్తత

Latest Videos

undefined

 డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కాలనీకి చెందిన గేటేడ్ కమ్యూనిటీ గేటును కాలనీవాసులు మూసివేశారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శకు వెళ్లకుండా అడ్డుకొన్నారు.

Also Read: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య: నిందితులు ముందే దొరికినా వదిలేశారు

ఆదివారం నాడు ఉదయం సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి చాడ వెంకట్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు డాక్టర్ ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. అయితే కాలనీవాసులు గేట్లు మూసివేశారు జాలి, సానుభూతి తమకు వద్దని కూడ డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులు చెప్పారు.

దీంతో కాలనీవాసులు కూడ రాజకీయ పార్టీ నేతలను డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని కలవకుండా అడ్డుకొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కాలనీకి చేరుకోగానే కాలనీవాసులు అడ్డుకొన్నారు.

Also Read: మా ఇంటికి రావొద్దు: ప్రియాంక పేరెంట్స్, ఇంటికి తాళం వేసుకుని....

తాము డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను కలవకుండా ఇక్కడి నుండి పోలేమని సీపీఐ నేతలు చెప్పారు. తమను డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను కలుసుకొనే అవకాశం కల్గించాలని  సీపీఐ నేతలు కోరారు. ఈ సమయంలో సీపీఐ నేతలు నిరసనకు దిగారు. చివరకు అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడి వెళ్లి పోయారు.

ఆ తర్వాత సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చరుపల్లి సీతారాములు పార్టీ నేతలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. వాళ్లను కూడ కాలనీ వాసులు రాకుండా అడ్డుకొన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కూడ కాలనీవాసులు అడ్డుకొన్నారు. రేవంత్ రెడ్డిని కూడ కాలనీవాసులు రాకుండా అడ్డుపడ్డారు.ఎట్టకేలకు రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాన్నిపరామర్శించారు. 

డాక్టర్ ప్రియాంక రెడ్డి  హత్య విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు చర్లపల్లి జైలు వద్ద కూడ న్యాయవాదులు, యువకులు, మహిళలు కూడ ఆందోళన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 
 

click me!