నీట్ పరీక్ష: ముక్కు పుడకను కట్ చేస్తేనే విద్యార్థినికి అనుమతి

By narsimha lodeFirst Published May 5, 2019, 5:18 PM IST
Highlights

నీట్ ప్రవేశ పరీక్షలు  రాసే విద్యార్థులకు నిబంధనలు తీవ్రంగా గందరగోళంగా మారాయి.  గతంలో కూడ  నీట్ పరీక్షల సందర్భంగా  ఉన్న నిబంధనలు కూడ విమర్శలు వెల్లువెత్తాయి.

హైదరాబాద్: నీట్ ప్రవేశ పరీక్షలు  రాసే విద్యార్థులకు నిబంధనలు తీవ్రంగా గందరగోళంగా మారాయి.  గతంలో కూడ  నీట్ పరీక్షల సందర్భంగా  ఉన్న నిబంధనలు కూడ విమర్శలు వెల్లువెత్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 80 వేల మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ఓ విద్యార్థినికి ముక్కుపుడకతో పరీక్ష కేంద్రానికి హాజరైంది. ముక్కుపుడక  తీయడానికి  రాకపోవడంతో  కటింగ్ ప్లేయర్‌తో ముక్కు పుడకను తొలగించారు. 

పుల్ షర్ట్స్‌ వేసుకొన్న విద్యార్ధి పరీక్ష కేంద్రానికి హాజరైతే.... పరీక్ష కేంద్రంలోకి ఆ విద్యార్థిని అనుమతించలేదు.  దీంతో ఆ విద్యార్థి తన ఫుల్ షర్ట్స్ హ్యాండ్స్‌ను కత్తిరించుకొన్న  తర్వాతే అతణ్ణి లోనికి  అనుమతించారు.

చాలా పరీక్ష కేంద్రాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు, ఎత్తు మడమల చెప్పులు, చేతి గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు ధరించవద్దని.. మంచినీళ్ల సీసా, పెన్ను, పెన్సిల్‌, స్కేలు, క్యాలిక్కులేటర్‌, ప్యాడ్‌, ఎరేజర్‌కు కూడా అనుమతిలేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
 

click me!