అమెరికాలో వేపపుల్లల ధరెంతో తెలసా ?

First Published Jul 21, 2017, 6:53 PM IST
Highlights

వేప పుల్లలకు అమెరికాలో మాంచి గిరాకీ

వేప పుల్లలతో పళ్లు తోమడం మరచిపోతున్న ఇండియన్స్

అమెరికాలో గిరాకీ చూసి షాక్ అవుతున్న భారతీయులు

మనం వేపపుల్లలను పండ్లు తోమడానికి ఉపయోగించేవాళ్లం. వాటిలో ఆయుర్వేద గుణాలు ఉండి నోటి సమస్యలు రాకుండా ఉండేందుకు వాడేవాళ్లం. కానీ ఆధునిక కాలంలో వేపపుల్లలతో పండ్లు తోమడం చిన్నచూపుగా అనిపిస్తున్నది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేపపుల్లలు పక్కన పడేసి బ్రెష్షు, పేస్టూ వాడకం షురూ చేశాము.

కానీ అమెరికాలో వేపపుల్లల గిరాకీ చేస్తే షాక్ కు గురవుతారు. అక్కడ వేప పుల్లలకు $9.95 డాలర్ అమ్ముతున్నారట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 700 రూపాయలు అన్నమాట.

మనకు ఇక్కడ టూత్ పేస్టు పిచ్చి పట్టింది కాబట్టి వేపపుల్లల విలువ తెలియకుండా పోయింది కానీ అమెరికా వాళ్లు వేప పుల్లలకు ఇచ్చే ఇంపార్టెన్స్ చూసిన తర్వాతైనా మనం మారక తప్పదేమో మరి? ఇంకెందుకు ఆలస్యం కనీసం వారంలో ఒకరోజైనా వేపపుల్లలతో పళ్లు తోముకుంటే బెటర్ మరి.

click me!