ఈ దేవసేన బోనమెత్తింది

First Published Jul 21, 2017, 6:36 PM IST
Highlights

జనగామ కలెక్టర్ బోనమెత్తుకున్నారు

మహాంకాలి అమ్మవారికి బోనం సమర్పణ

కలెక్టర్ బోనం ఎత్తుకోవడంతో అభిందనల వెల్లువ

తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ బోనాలు. తెలంగాణ ప్రజలు గ్రామ దేవతలను భక్తి ప్రపత్తులతో నైవేద్యాన్ని బోనం పేరుతో సమర్పిస్తుంటారు. టిఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రాగానే బోనాలు పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటినుంచి బోనాల పండుగ మరింత శోభను సంతరించుకున్నది. సాధారణ ప్రజలే కాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని భక్తిని చాటుకుంటున్నారు.

జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో  కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన పాల్గొన్నారు. ఆమె స్వయంగా బోనమెత్తుకున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించిన మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆలయ పరిసరాల్లో తులసి మొక్కను నాటారు. కలెక్టర్ స్వయంగా బోనమెత్తుకోవడంతో స్థానికులు ఆమెను అభినందించారు.

click me!