దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీలు : ఏపీ, తెలంగాణలకు కూడా.. ఏ రాష్ట్రానికి ఎన్నంటే..?

By Siva KodatiFirst Published Jun 8, 2023, 9:20 PM IST
Highlights

దేశంలో కొత్తగా మరో 50 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణలకు కలిపి 17 దక్కాయి. 

దేశంలో కొత్తగా మరో 50 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణలకు కలిపి 17 దక్కాయి. ఏపీకి 5 (ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం).. తెలంగాణకు 12 (మేడ్చల్ , వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌) వైద్య కళాశాలలను కేటాయించింది కేంద్రం. 

2023 - 24 విద్యా సంవత్సరం నుంచి ఈ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో మెడికల్ కాలేజీలో 150 సీట్లు వుంటాయని తెలిపింది. మేడ్చల్ జిల్లాలో అరుంధతి ట్రస్ట్, సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిన వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని కేంద్రం తెలిపింది. 

click me!