సరూర్‌నగర్‌ చెరువులో గల్లంతైన నవీన్ మృతదేహం వెలికితీత(వీడియో)

Published : Sep 21, 2020, 03:59 PM ISTUpdated : Sep 21, 2020, 05:05 PM IST
సరూర్‌నగర్‌ చెరువులో గల్లంతైన నవీన్ మృతదేహం వెలికితీత(వీడియో)

సారాంశం

సరూర్‌నగర్ చెరువులో నిన్న గల్లంతైన నవీన్ కుమార్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం సోమవారం నాడు వెలికితీసింది.

హైదరాబాద్: సరూర్‌నగర్ చెరువులో నిన్న గల్లంతైన నవీన్ కుమార్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం సోమవారం నాడు వెలికితీసింది.

ఆదివారం నాడు స్కూటీపై వెళ్తూ సరూర్‌నగర్ చెరువులో నవీన్ కుమార్  గల్లంతయ్యాడు. నవీన్ కోసం నిన్నటి నుండి జీహెచ్ఎంసీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు.

ఆదివారం నాడు హైద్రాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ఆయన ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

"

నిన్న రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగించారు. ఇవాళ ఉదయం నుండి సహాయక చర్యలను చేపట్టారు. చెరువులోకి వరద నీరు వస్తుండడం బురద, చెత్తా చెదారం కారణంగా రెస్క్కూ ఆపరేషన్ కు ఇబ్బందిగా మారింది. 

సోమవారం నాడు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో  సరూర్ నగర్ చెరువులో నవీన్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. గల్లంతైన ప్రాంతానికి 30 మీటర్ల దూరంలోనే నవీన్ డెడ్ బాడీ లభ్యమైంది.

ఆల్మాస్ గూడకు చెందిన నవీన్ ఎలక్ట్రీషీయన్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నవీన్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

గత వారంలో భారీ వర్షాలతో నాలాలో నేరేడ్‌మెట్ లో 12 ఏళ్ల బాలిక సుమేథ కొట్టుకుపోయింది.  సైకిల్ తొక్కుకొంటూ వెళ్లిన సుమేథ నాలాలో పడిపోయి చనిపోయింది. ఈ ఘటన జరిగి వారం రోజులు కాకముందే  సరూర్ నగర్ చెరువులో పడి నవీన్ మరణించాడు. 

 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu