దేశ రాజకీయాలకు కేసీఆర్ అవసరం.. ఆయనపై ప్రజలకు నమ్మకం పెరిగింది: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

By Mahesh KFirst Published Nov 8, 2022, 11:17 AM IST
Highlights

దేశానికి తెలంగాణ మోడల్ చాలా అవసరం అని, తెలంగాణలో అభివృద్ధితో కేసీఆర్ పై దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశ రాజకీయాలకు కేసీఆర్ అవసరం చాలా ఉన్నదని తెలిపారు.
 

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉపఎన్నిక గురించి మాట్లాడారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలుపు.. లౌకికవాదుల గెలుపు అని అన్నారు. ఈ గెలుపు ప్రజల ఆకాంక్షను వెల్లడించిందని తెలిపారు. అలాగే, కేసీఆర్ దేశ రాజకీయల గురించి మాట్లాడారు.

అన్ని రంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్‌గా నిలిచిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఫలితంగా కేసీఆర్ పై దేశ ప్రజలకు నమ్మకం పెరిగిందని వివరించారు. కేసీఆర్ సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాటుపడతారని చెప్పారు. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం చాలా ఉన్నదని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశానికి ఇవాళ తెలంగాణ మోడల్ చాలా అవసరం అని వివరించారు.

బీజేపీ నిరంకుశ విధానాలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని, మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తులకు ఈ తీర్పు చెంపపెట్టు అని గుత్తా తెలిపారు. తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని స్పష్టమైందని చెప్పారు.

Also Read: ఏపీపై కూడా కేసీఆర్ గురి.. మొత్తంగా 100 స్థానాలు టార్గెట్.. బీఆర్ఎస్ ఎన్నికల వ్యుహం ఇదేనా..!

దేశానికి మార్గదర్శనంలా పాలిటిక్స్ చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలను నవ్వులపాలు చేశారని చెప్పారు. కానీ, ఈ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖను కూడా దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని తెలిపారు. 

ఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా రాజకీయంగా నష్టపోయారని పేర్కొన్నారు.

click me!