హైదరాబాద్ లో గంట 46 నిమిషాల పాటు చంద్రగ్రహణం.. మూతపడ్డ యాదాద్రి, కొమురవెల్లి ఆలయాలు..

By SumaBala Bukka  |  First Published Nov 8, 2022, 10:38 AM IST

హైదరాబాద్ లో చంద్రగ్రహణం గంటా 46నిమిషాల పాటు కనిపించనుందని బిర్లా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. 


హైదరాబాద్ : ఈ యేడాదిలో చివరి చంద్రగ్రహణం మంగళవారం నాడు కనిపించనుంది. కొన్ని నగరాల్లో అది సంపూర్ణంగా కనిపించనుండగా, హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు ఏమీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో చంద్రగ్రహణం సాయంత్రం 5.40కి ప్రారంభమై.. 7.26గంటలకు ముగుస్తుంది. మొత్తంగా గంటా 46 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని జి.పి. బిర్లా ఆర్కియాలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్  ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఇక సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూతపడింది. ఉదయం ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తి చేసి 8.15 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. గ్రహణ సమయం ఈ రోజు మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రారంభమై 6.19 గంటలకు సమాప్తం కానుంది. రేపు ఉదయం 9నుంచి స్వామి వారి ఉభయ దర్శనాలతో పాటు, నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ ప్రదాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు. 

Latest Videos

చంద్ర గ్రహణం 2022: భారత్ లో గ్రహణం కనిపించే సమయం ఇదే....!

చంద్రగ్రహణం కారణంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయం వద్దర ఉన్న ఉపాలయాలను కూడా మూసేశారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారి ఆలయ ద్వార బంధనం కొనసాగనుంది. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి అభిషేకం, మంగలహారతి, నివేదన నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. 

click me!