
తెలంగాణ ప్రభుత్వంపై (telangana govt) జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) (national green tribunal) మండిపడింది. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్‌రెడ్డి (revanth reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.
పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే కేసీఆర్( kcr) ప్రభుత్వం పాత సచివాలయం కూలగొట్టి కొత్త సచివాలయం (telangana secretariat demolition ) నిర్మిస్తోందని గతంలో రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో వెంటనే తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం మరో మూడు వారాల పాటు గడువు విధించింది.
కాగా.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాత సచివాలయ భవనం కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై కాంగ్రెస్ (congress) ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో అక్టోబర్ 15న విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడంతో పాటు సచివాలయ నిర్మాణంలో యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఈ పిటిషన్ ద్వారా కోరాడు. అంతేకాకుండా పర్యావరణ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
Also Read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: సుప్రీంకోర్టుకెక్కిన రేవంత్ రెడ్డి
నిజాంల కాలంనాటి పురాతన భవనంలో కొనసాగుతున్న ప్రస్తుత సచివాలయ భవనాన్ని గుప్తనిధుల కోసమే కూలుస్తున్నారంటూ ఇదివరకే ఎంపీ రేవంత్ ఆరోపించారు. అందుకోసం కాకుంటే సెక్రటేరియేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర కఠిన నిషేధాజ్ఞలు విధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మంచి కార్యక్రమాలు ఎవరైనా పగలే చేస్తారని... దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పగటి సమయంలోనే జరుగుతుందన్నారు. కానీ గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. పోఖ్రాన్ అణు పరీక్షలు కూడా ఇంత రహస్యంగా జరపలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
సచివాలయం కూల్చివేత సమయంలో ఎవ్వరినీ సెల్‌ఫోన్లు తీసుకెళ్లనివ్వలేదని.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారని వెంటనే వారిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలను బట్టి తాము పరిశోధన చేయగా.. నిజాం నిధుల విషయం వెలుగులోకి వచ్చిందని.. దీని గురించి కేసీఆర్ పత్రికతో పాటు జాతీయ పత్రికలు సైతం గతంలో రాశాయని రేవంత్ పాత పేపర్ కటింగ్‌లను చూపించారు.