టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా

Siva Kodati |  
Published : Nov 25, 2021, 04:55 PM IST
టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా

సారాంశం

ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll)  ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయిన టీఆర్ఎస్ (trs party) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచంద్రరావు (gattu ramachandra rao) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు

ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll)  ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయిన టీఆర్ఎస్ (trs party) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచంద్రరావు (gattu ramachandra rao) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు.

తాను ఆశించిన స్థాయిలో పార్టీలో రాణించలేకపోయానని… కేసీఆర్‌ అభిమానం పొందడంలో గుర్తింపు తెచ్చు కోవడంలో విఫలమయ్యానని ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్‌లో కొనసాగడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామచంద్రరావు తెలిపారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇన్ని రోజులు తనకు అన్ని బాధ్యతలు అప్పగించినందుకు గానూ పార్టీ నాయకత్వానికి ధన్య వాదాలు అంటూ గట్టు లేఖ విడుదల చేశారు. అయితే.. తన భవిష్యత్తు కార్యచరణను మాత్రం గట్టు రామచంద్రరావు చెప్పలేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?