హైదరాబాద్‌లో దారుణం: వైద్యం పేరుతో అక్కాచెల్లెళ్ల‌పై బాబా, బాబా కుమారుడు అత్యాచారం

Siva Kodati |  
Published : Nov 25, 2021, 06:31 PM IST
హైదరాబాద్‌లో దారుణం: వైద్యం పేరుతో అక్కాచెల్లెళ్ల‌పై బాబా, బాబా కుమారుడు అత్యాచారం

సారాంశం

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై బాబా (fake baba) అత్యాచారం చేశాడు. దీంతో దొంగ బాబా అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై బాబా (fake baba) అత్యాచారం చేశాడు. దీంతో దొంగ బాబా అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇద్దరు యువతులు అనారోగ్యం పాలైన తమ తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పాతబస్తీలోని ఓ బాబా వద్దకు తీసుకొచ్చారు. అతని వద్ద తల్లికి వైద్యం చేయిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో మంత్రాల పేరుతో తల్లికి వైద్యం చేస్తున్నట్లు నటించి.. ఇద్దరు యువతులపై బాబా కన్నేశాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కామ వాంఛ పెంచుకున్నాడు. అక్కా చెల్లెళ్లపై పలు మార్లు అత్యాచారానికి (rape) తెగబడ్డాడు. ఇద్దరు యువతుల్లో ఒకరికి పెళ్లి అయ్యింది. పెళ్లైన యువతికి డైవర్స్‌ ఇప్పించి.. ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లైన యువతిపై బాబా కొడుకు కూడా అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు వారిని బాబా ఆర్థికంగా కుంగదీశాడు. బాధితురాళ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బాబా, బాబా కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?