నార్సింగి శ్రీచైతన్య కాలేజీ స్టూడెంట్ సాత్విక్ మృతిపై కేసు: స్పృహ తప్పిన తల్లి

By narsimha lode  |  First Published Mar 1, 2023, 10:32 AM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీ  ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్  సాత్విక్ మృతిపై  కేసు నమోదు  చేశారు.  సాత్విక్ డెడ్ బాడీని  పోస్టుమార్టం నిమిత్తం  ఆసుపత్రికి  తరలించారు.  
 


హైదరాబాద్: రంగారెడ్డి  జిల్లా నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీ  ఇంటర్ ఫస్టియర్  విద్యార్ధి సాత్విక్ మృతిపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. కాలేజీకి చెందిన  కృష్ణారెడ్డి, నరేష్, జగన్ తో పాటు  యాజమాన్యంపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. 

మంగళవారంనాడు  రాత్రి  కాలేజీ క్లాస్ రూమ్ లో  సాత్విక్ ఉరేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ ఘటనపై  సాత్విక్  పేరేంట్స్  , విద్యార్ధి సంఘాలు  బుధవారం నాడు కాలేజీ ముందు  బైఠాయించి ఆందోళనకు దిగారు.  

Latest Videos

undefined

సాత్విక్ మృతికి కారణమైన  వారిపై  చర్యలు తీసుకోవాలని  పేరేంట్స్ డిమాండ్  చేస్తున్నారు.   సాత్విక్ ను  కాలేజీకి చెందిన  ఆచార్య, కృష్ణారెడ్డి సహ ఇతర సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారని   సాత్విక్ కుటుంబ సభ్యులు  చెప్పారు.  సాత్విక్  ఆత్మహత్య  చేసుకున్న విషయాన్ని కాలేజీ  మేనేజ్ మెంట్  తమకు సమాచారం ఇవ్వలేదని కూడా  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  తోటి విద్యార్ధులే  బైక్ ను లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

గతంలో  కూడా సాత్విక్  ను  కాలేజీ సిబ్బంది  కొట్టడంతో   15 రోజుల పాటు  బెడ్ రెస్ట్ లో  ఉన్నాడని  పేరేంట్స్ చెబుతున్నారు. ఈ విషయమై  తాము  కాలేజీ యాజమాన్యంతో  మాట్లాడేందుక  ప్రయత్నించినా  స్పందించలేదని  సాత్విక్  బంధువులు  ఆరోపిస్తున్నారు.

also read:లెక్చరర్లు కొడితే 15 రోజులు బెడ్ రెస్ట్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ముందు సాత్విక్ పేరేంట్స్ ధర్నా

శ్రీచైతన్య కాలేజీ ముందు  ఆందోళనకు దిగిన  సాత్విక్ తల్లి కళ్లు తిరిగి పడిపోయింది.  సాత్విక్  మృతికి కారణమైన  కాలేజీ యాజమాన్యంపై  చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్  చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యంతో  మాట్లాడిస్తామని పోలీసులు సాత్విక్ పేరేంట్స్  కు నచ్చజెప్పే ప్రయత్నం  చేస్తున్నారు. 

ఉస్మానియాకు  సాత్విక్  డెడ్ బాడీ

ఉస్మానియా ఆసుపత్రికి  సాత్విక్ మృతదేహన్ని తరలించారు పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో  సాత్విక్  మృతదేహనికి  పోస్టుమార్టం  నిర్వహించిన తర్వాత  పేరేంట్స్ కు అప్పగించనున్నారు.
 

click me!