తప్పిన ప్రమాదం: హైద్రాబాద్ ఉప్పల్ వద్ద డీసీఎం వ్యాన్‌లో మంటలు

Published : Mar 01, 2023, 09:57 AM IST
తప్పిన ప్రమాదం:   హైద్రాబాద్ ఉప్పల్  వద్ద డీసీఎం వ్యాన్‌లో  మంటలు

సారాంశం

హైద్రాబాద్  ఉప్పల్ క్రాస్  రోడ్డు  వద్ద  డీసీఎం వ్యాన్ లో   మంటలు చెలరేగాయి.  ఈ మంటలను  గుర్తించిన డ్రైవర్  వెంటనే  వాహనం నుంది  దిగడంతో  పెద్ద ప్రమాదం  తప్పింది.

హైదరాబాద్:  హైద్రాబాద్ ఉప్పల్ క్రాస్  రోడ్డు వద్ద బుధవారం నాడు డీసీఎం వ్యానులో  మంటలు చెలరేగాయి. పాతపేపర్లు తీసుకెళ్తున్న వాహనంలో  ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి.   డీసీఎం క్యాబిన్ లో  షార్ట్ సర్క్యూట్  కారణంగా  డీసీఎంలో  మంటలు చెలరేగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  డీసీఎం వాహనంలో  మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్  వాహనం నుండి కిందకు దూకేశాడు.  దీంతో  డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది.   ఈ విషయమై  డ్రైవర్  పోలీసులకు  సమాచారం ఇచ్చారు.  పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని సంఘటనస్థలానికి రప్పించారు.  ఫైరింజన్లు  డీసీఎంలో చెలరేగిన మంటలను  ఆర్పివేశాయి.  

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు | Asianet Telugu
Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు| Asianet News Telugu