హుజురాబాద్ ఉపఎన్నిక: భారీగా డబ్బు, బంగారం సీజ్... ఎంతో తెలుసా..?

By Siva KodatiFirst Published Oct 17, 2021, 11:09 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad byPoll) సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు , విజిలెన్స్ , పోలీస్ బృందాల తనిఖీల ద్వారా ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న 1,57,18,727 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (district election officer), కలెక్టర్ తెలిపారు

హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad byPoll) సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు , విజిలెన్స్ , పోలీస్ బృందాల తనిఖీల ద్వారా ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న 1,57,18,727 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (district election officer), కలెక్టర్ తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి, అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.  స్టాటిక్ సర్వే‌లెన్స్ బృందాలు , పోలీస్ చెకింగ్ టీమ్స్,  ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, మద్యం పట్టుబడినట్లు ఆయన తెలిపారు. 

ఇప్పటి వరకు 1,57,18,727 రూపాయల నగదును, 1,50,000 రూపాయల విలువైన 30 గ్రాముల బంగారం.. రూ. 9,10,000 విలువైన 14 కిలోల వెండిని.. రూ. 5,34,667 విలువైన 900 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రూ. 2,21,000 విలువ గల 66 చీరలు, 50 షర్టులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అలాగే రూ.19,750 విలువైన 3.51 కిలోల గంజాయిని పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు.

ALso Read:Huzurabad bypoll: బరిలో 27 మంది ఇండిపెండెంట్లు... కమలం, కారును పోలిన గుర్తులు, ఎవరి కొంపముంచుతారో?

కాగా, టీఆర్ఎస్‌లో (trs) కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో (bjp) చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ (congress) నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 

హుజురాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈ రోజు వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. ఉపపోరుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారికి నిబంధనలను వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఇక ప్రచార పర్వం ఊపందుకునే అవకాశం వుంది.

click me!