
పరీక్షల హాజరు కాకపోవడంతో లెక్చరర్ తోటి విద్యార్థుల ముందు తిట్టాడని అవమానం భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఎర్రగడ్డ మోతీ నగర్ కు చెందిన శ్రీ వర్ష .. ఎస్ ఆర్ నగర్ లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపిసి రెండో సంవత్సరం చదువుతుంది.
కాగా, ఇటీవల జరిగిన పరీక్షలకు ఆమె హాజరు కాలేదు. దీంతో కళాశాల లెక్చరర్ తోటి విద్యార్థల ముందు ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రీ వర్ష.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది.
కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటే ప్రాణాలు విడిచింది.
కాగా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కూతరు ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు.