చీటింగ్ కేసులో నందకుమార్‌‌కు బెయిల్ ఇచ్చిన కోర్టు.. ఆ తర్వాత ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..!

By Sumanth KanukulaFirst Published Dec 3, 2022, 4:27 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైన చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా నాంపల్లి కోర్టు నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. 
 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల్లో ఒకరైన నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైన చేసిన సంగతి తెలిసిందే. . ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు ఇటీవల రెండు రోజుల పాటు నందకుమార్‌ను కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు కేసులో నందకుమార్‌కు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా.. తాజాగా బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

రూ. 10 వేలు పూచీకత్తుతో 2 జామీనులను సమర్పించాలని నందకుమార్‌ను కోర్టు ఆదేశించింది. అయితే అదే సమయంలో నందకుమార్‌పై మరో కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ కోరారు. ఇందిరా అనే మహిళ నందకుమార్‌పై ఫిర్యాదు  చేసిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే నందకుమార్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులు కోర్టు కోరింది. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేర్వేరుగా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్‌‌ సమర్పించాలని.. అంతే మొత్తానికి రెండు షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేసింది.  ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌‌ చార్జిషీట్‌‌ దాఖలు చేసేవరకు ప్రతి సోమవారం వారి ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముగ్గురు నిందితులు వారి పాస్‌పోర్టులను పోలీసు స్టేషన్‌లో సరెండర్ చేయాలని ఆదేశించింది. 

click me!