పోలీసులపై దాడి: వైఎస్ షర్మిలకు మే 8 వరకు జ్యుడిషీయల్ రిమాండ్

By narsimha lode  |  First Published Apr 24, 2023, 9:48 PM IST

వైఎస్ఆర్‌టీపీ  చీఫ్ వైఎస్ షర్మిలను  పోలీసులు ఇవాళ  అరెస్ట్  చేశారు. నాంపల్లి కోర్టులో ఆమెను హాజరుపర్చారు.  కోర్టు షర్మిలకు  14 రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది.  


హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్ షర్మిలకు 14 రోజుల  జ్యుడిషీయల్  రిమాండ్ ను విధించింది  నాంపల్లి  కోర్టు.  షర్మిలను  చంచల్ గూడ జైలుకు  తరలించాలని ఆదేశించింది  కోర్టు. .  ఈ ఏడాది మే  8 వరకు  జ్యుడిషీయల్ రిమాండ్  విధిస్తూ  సోమవారంనాడు  రాత్రి  కోర్టు ఆదేశాలు  జారీ చేసింది.   పోలీసులపై దాడి  కేసులో  షర్మిలను  పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 


పోలీసులపై  దురుసుగా  ప్రవర్తించడమే కాకుండా  దాడి చేశారని  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్ వైఎస్ షర్మిల ను   హైద్రాబాద్ పోలీసులు  సోమవారంనాడు  అరెస్ట్  చేశారు. సోమవారంనాడు సాయంత్రం గాంధీ  ఆసుపత్రిలో  వైద్య పరీక్షలు  నిర్వహించారు.  అనంతరం నాంపల్లి  కోర్టులో  ఆమెను హాజరుపర్చారు. 
నాంపల్లి కోర్టులో  ఇరువర్గాలు తమ వాదలను విన్పించాయి.  

Latest Videos

మగ పోలీసులు  దురుసుగా ప్రవర్తించారని వైఎస్ షర్మిల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  వారంట్ లేకుండా  పోలీసులు  షర్మిల ఇంటిపై పడ్డారని  షర్మిల తరపు న్యాయవాది  చప్పారు. అంతేకాదు   ఎలాంటి అరెస్ట్  నోటీసుు ఇవ్వలేదని  షర్మిల తరపు న్యాయవాది చెప్పారు.  

షర్మిలను  తాకే  ప్రయత్నం  చేశారని  కూడా ఆమె తరపు న్యాయవాది  తెలిపారు.  ఆత్మరక్షలోభాగంగానే  పోలీసులను  షర్మిల  నెట్టివేశారని  ఆమె న్యాయవాది కోర్టును  కోరారు.  
రిమాండ్ ను తిరస్కరించాలని  కోరారు.  షర్మిల తరపు న్యాయవాది వాదనలను  పోలీసుల తరపు న్యాది  కౌంటర్ చేశారు. విధి నిర్వహణలో  ఉన్న పోలీసులపై  షర్మిల  దాడికి పాల్పడిందని  పోలీసుల తరపు న్యాయవాది వాదించారుు.  

also read:పోలీసులపై దాడి: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

వేగంగా కారు పోనివ్వాలని  డ్రైవర్ ను షర్మిల ఆదేశించారని  పోలీసుల తరపు న్యాయవాది  చెప్పారు.  షర్మిల  కారు డోరు తగిలి కానిస్టేబుల్ కు గాయమైందన్నారు. అంతేకాదు  ముగ్గురు  పోలీసులపై షర్మిల   చేయి చేసుకున్నారని  కూడా  పోలీసుల తరపు న్యాయవాది  కోర్టుకు  చెప్పారు.  గతంలో కూడా షర్మిలపై  కేసులున్నాయని  కోర్టు  దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  షర్మిలకు   మే 8వ తేదీ వరకు  జ్యుడీషీయల్ రిమాండ్  విధిస్తూ  కోర్టు ఆదేశాలు  జారీ చేసింది ఇదిలా ఉంటే  వైఎస్ షర్మిల  బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  కూడా  వాదనలు జరగనున్నాయి.  

click me!